కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం కాంతార చాప్టర్ 1. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది. దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన కాంతార తొలి రోజు రూ. 89 కోట్లు భారీ ఓపెనింగ్ అందుకుంది. కన్నడలో ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ నెలకొల్పింది. హిందిలో కాంతారాచాప్టర్ 1 రూ. 150 కోట్ల మార్కును దాటింది. కలెక్షన్స్ తగ్గినా కూడా డిస్కౌంట్ టికెట్ ఆఫర్ అమలులో ఉండటంతో కలెక్షన్స్ స్టడీగా ఉంటాయని ట్రేడ్ అంచనా వేస్తుంది.
Also Read : Mega 158 : మెగాస్టార్ – బాబీ కొల్లి సినిమాలో హీరోయిన్ గా కేరళ హాటీ
కాగా ఈ సినిమా రిలీజ్ అయిన 11 రోజులకు గాను రూ. 655 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దూసుకెళ్తోంది.అటు ఓవర్సీస్ లోను 4.3 మిలియన్ డాలర్స్ వసూళ్లు రాబట్టిందని అధికారకంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే ఓవర్సీస్ లో కాంతార చాఫ్టర్ 1 బ్రేక్ ఈవెన్ కష్టమనే అనిపిస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను 8 మిలియన్ డాలర్స్ కు కొనుగోలు చేసారు. కాంతార ఓవర్సీస్ లో భారీ వసూళ్లు రాబట్టడంతో ఇప్పుడు వచ్చిన సీక్వెల్ ను భారీ ధరకు కొనుగోలు చేసారు. కాంతార ఛాపర్ 1 బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 5 మిలియన్ డాలర్స్ రాబట్టాలి. ఇప్పటికే కలెక్షన్స్ నెమ్మదించడం, మరోవైపు కొత్త సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతుండడంతో ఐదు మిలియన్ రాబట్టడం అనేది టఫ్ టాస్క్. ఫైనల్ రన్ ఎక్కడ ఆగుతుందొ ఎంత రాబడుతుందో చూడాలి.
