Site icon NTV Telugu

Kannappa: ‘కన్నప్ప’ టైం బాగున్నట్టే ఉంది!

Kannappa

Kannappa

అంతా చూస్తుంటే, ‘కన్నప్ప’ సినిమాకు టైమింగ్ బాగున్నట్లే కనిపిస్తోంది. నిజానికి, ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి, తర్వాత విడుదల చేసిన కంటెంట్ విషయంలో ఎన్నో ట్రోల్స్ జరిగాయి. అయితే, అనూహ్యంగా సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత కొంత పాజిటివ్ రెస్పాన్స్ ఏర్పడింది. ఇప్పుడు ‘బుక్ మై షో’తో పాటు ఇతర టికెట్ ప్లాట్‌ఫామ్‌లలో మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. ఈ సినిమాకి చివరి 24 గంటల్లో 115,000 టికెట్లు అమ్ముడైనట్టు విష్ణు వెల్లడిస్తూ ఆనందం వ్యక్తం చేశాడు.

Also Read : Rashmika Mandanna: మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా సైన్ చేసిన నేషనల్ క్రష్షు

‘కుబేర’ సినిమా దాదాపు అందరి ప్రేక్షకులకు చేరడంతో, ఇప్పుడు నెక్స్ట్ బిగ్ థింగ్గా ‘కన్నప్ప’ కనిపిస్తోంది. హైదరాబాద్‌కు సంబంధించిన సింగిల్ థియేటర్‌లలో బుకింగ్‌లు దాదాపు పూర్తయ్యాయి. హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అలాగే, మల్టీప్లెక్స్ ప్రేక్షకులు కూడా నెమ్మదిగా టికెట్లు బుక్ చేయడం మొదలుపెట్టారు. నిజానికి, మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమాపై టీమ్‌కు చాలా నమ్మకం ఉంది.

Also Read : Allu Arjun: బన్నీ కోసం ‘అమెరికా బ్యాచ్’

కానీ, బయటి నుంచి చూసే వారికి ఈ సినిమా వర్కౌట్ అవుతుందని మొదట్లో అనిపించలేదు. అయితే, ఇప్పుడు బుకింగ్‌లు చూస్తుంటే బాగున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ మ్యాజిక్ పనిచేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఆయా హీరోల మ్యాజిక్ కూడా పనిచేసే అవకాశం ఉంది.

Exit mobile version