Site icon NTV Telugu

Vijay : విజయ్ చివరి సినిమాలో కన్నడ సూపర్ స్టార్

Vijay 69

Vijay 69

తమిళ స్టార్ హీరో విజయ్ వచ్చే ఏడాదిలో పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. ఈ నేపథ్యంలో సినీకెరీర్ కు స్వస్తి పలకనున్నట్టు గతంలో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తన చివరి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా విజయ్ కెరీర్ లో 69వ గా రానుంది. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read : Megastar Chiru : బాసూ నీ టైమింగ్ ని కొట్టేవాళ్ళు లేరు..

ఈ సినిమాలో అన్ని బాషలకు చెందిన స్టార్ నటీ నటులు కీలక పాత్రలలో నటించబోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ను ఈ సినిమాలో ఆన్ బోర్డ్ చేసారు. ఆయనతో పాటు తమిళ్ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, నటి ప్రియమణిలు విజయ్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే మలయాళ బ్యూటీ ప్రేమలు సినిమాతో ఆకట్టుకున్న మమిత బిజూ విజయ్ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తోంది. తాజగా ఈ సినిమాలో మరొక స్టార్ నటుడు వచ్చి చేరాడు. ఆయనే కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్. H. వినోద్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో నటిస్తున్నట్టు తాజగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో స్వయంగా శివన్న  మాట్లాడుతు ‘ విజయ్69 లో నాకు క్యారెక్టర్ ఆఫర్ చేయబడింది. నా డేట్స్ అడ్జెస్ట్ మెంట్ ప్రకారం నా క్యారక్టర్ ఎలా డిజైన్ చేస్తారో తెలియదు. విజయ్ చాలా మంచి నటుడు.  అతను సినిమాలు చేస్తూనే ఉండాలని నా కోరిక’ అని అన్నారు.

Exit mobile version