Megastar Chiru : బాసూ నీ టైమింగ్ ని కొట్టేవాళ్ళు లేరు..
- సత్యదేవ్ హీరోగా వస్తున్న సినిమా జీబ్రా
- ముఖ్య అతిదిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి
- ఉత్తరాంధ్ర యాసలో అదరగొట్టిన మెగాస్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. మంగళవారం జరిగిన ఈవెంట్ లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ‘జీబ్రా’లో మంచి కంటెంట్ వుంది. తప్పకుండా జీబ్రా సూపర్ హిట్ బొమ్మ అవుతుంది అని అన్నారు అని మెగాస్టార్ చిరంజీవి. ఈ జీబ్రా ట్రైలర్ లాంఛ్ వేడుకలో జరిగిన ఓ సరదా సన్నివేశానికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read : OTT : ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు ఇవే..
Also Read
ముఖ్య అతిధిగా హాజరైన మెగాస్టార్ చిరు వేదికపై మాట్లాడుతుండగా ఓ అభిమాని గట్టిగా అరుస్తూ ” బాసూ మిమ్మల్ని చూసేందుకు నేను వైజాగ్ నుంచి వచ్చాను, మీ కోసం వచ్చాను బాసు’ అని అన్నాడు. అప్పటిదాకా ఈ సినిమా గురించి మాట్లాడుతున్న చిరు ఒక్కసారిగా స్పీచ్ ఆపేసి ‘అయితే ఏటంటావ్ ఇప్పుడు, నువ్వు వైజాగ్ నుంచి వచ్చినందుకు సంతోషమే, మరి ఈ బొమ్మను నువ్వు వైజాగ్‌లో ఆడించాలి భలేవాడివే, మన హీరోది కూడా అదే ఊరు మరి, కుసో కుసో రా కాసేపు” అంటూ ఉత్తరాంధ్ర యాసలో సమాధానం ఇచ్చారు. దీంతో ఈవెంట్ మొత్తం చప్పట్లతో మారుమోగింది. అక్కడున్న ప్రేక్షకులు, ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘చిరు టైమింగ్ సూపర్’, ‘బాసూ నీ టైమింగ్ ని ఎవరు మ్యాచ్ చేయలేరు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. సత్యదేవ్ నటించిన ‘జీబ్రా’ ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
#MegastarChiranjeevi వింటేజ్ చిరు అలా వచ్చి ఇలా వెళ్ళాడు.. #ZebraPreReleaseEvent #ZEBRAOnNov22nd #Zebra #Chiranjeevi
— తార-సితార (@Tsr1257) November 13, 2024
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!