కన్నడ సినీ పరిశ్రమలో రాకింగ్ స్టార్ యష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన తల్లి శ్రీమతి పుష్ప అరుణ్‌కుమార్ ఇప్పుడు నిర్మాతగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆమె PA ప్రొడక్షన్స్ బ్యానర్‌ను స్థాపించి, కన్నడ చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడు డా. రాజ్‌కుమార్, ఆయన భార్య పార్వతమ్మ రాజ్‌కుమార్ స్ఫూర్తితో కొత్తవారికి అవకాశాలు కల్పిస్తున్నారు. పుష్ప అరుణ్‌కుమార్ నిర్మాతగా తొలి చిత్రం ‘కొత్తలవాడి’. ప్రతిభావంతుడైన నటుడు పృథ్వీ అంబార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సిరాజ్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. గత నెలలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అద్భుతమైన స్పందన పొంది, సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.
Also Read:Pawan Kalyan : ‘సత్యాగ్రహి’ సినిమా ఆగిపోవడానికి కారణం ఇదే..
మే 21, 2025 (బుధవారం) నాడు విడుదలైన ‘కొత్తలవాడి’ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. 90 సెకన్ల ఈ టీజర్ పాత్రల లోతైన భావోద్వేగాలను, సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మాస్, కమర్షియల్ అంశాలతో ఆకట్టుకుంటోంది. కార్తీక్ సినిమాటోగ్రఫీ, అభినందన్ కశ్యప్ అందించిన శక్తివంతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పృథ్వీ అంబార్ రగ్డ్, ఎనర్జిటిక్ లుక్ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి.
Also Read: Balagam : బలగం సినిమా రిపీట్.. 60 ఏళ్ల వయసులో పంతాలు విడిచిన అన్నదమ్ములు..
ఈ టీజర్ సినిమా రూటెడ్, శక్తివంతమైన కథను హైలైట్ చేస్తూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ‘కొత్తలవాడి’ కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా, గుండ్లుపేట్ తాలూకులోని ఒక గ్రామం పేరు. ఈ సినిమా కథకు స్థానికతను జోడించేందుకు ఎక్కువ భాగం ఇక్కడే చిత్రీకరించారని తెలుస్తోంది. ఇక స్థానిక యాస, సంభాషణలు కథకు ప్రామాణికతను తీసుకొచ్చాయి. ఈ సినిమాలో పృథ్వీ అంబార్‌తో పాటు గోపాల్ దేశ్‌పాండే, రాజేష్ నటరంగ, అవినాష్, కావ్య శైవ, మన్షి సుధీర్, రఘు రమణ కొప్ప, చేతన్ గంధర్వ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
