Site icon NTV Telugu

Kanguva : విడుదలకు ముందే కేరళలో కంగువ రికార్డ్

Kanguvafirstpanindiantamilfilm

Kanguvafirstpanindiantamilfilm

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.

Also Read : Prashant Varma : సినిమాలు తీసి మీ డబ్బును వృధా చేసుకుంటారు ఎందుకు

మరో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న కంగువ బుకింగ్స్ ఓపెన్ చేసారు. తెలుగు, తమిళ్ లో డీసెంట్ గా సాగుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కేరళలో దుమ్ము దులుపుతున్నాయి. కేరళ అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓ సారి పరిశీలిస్తే ఇప్పవరకు రూ. 1. 05 కోట్లు రాబటట్టింది. ఇది హీరో సూర్య కెరీర్ లోనే హయ్యెస్ట్  బుకింగ్స్. గతంలో సూర్య సినిమాకు సంబందించిన ఈ రికార్డు (ET ) సినిమా పేరిట ఉంది. 2022లో వచ్చిన ఈ సీనియా కేరళలో అడ్వాన్స్ బుకింగ్స్ లో రూ. 25 లక్షలు రాబట్టింది. ఈ రికార్డును రిలీజ్ కు ఇంకా రెండు రోజులు ఉండగానే బ్రేక్ చేసాడు. భారీ అంచనాల మధ్య రాబోతున్న కంగువ కేరళలో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇప్పటికే తెల్లవారు జామున ఫ్యాన్స్ షోస్ తో హంగామా సృష్టిస్తున్నారు సూర్య ఫాన్స్.  రిలీజ్ నాటికి అడ్వాన్స్ రూపంలో మరింత కలెక్షన్ రాబట్టే అవకాశం ఉంది.

Exit mobile version