ఇండియన్ 2 దెబ్బకు డిస్ట్రిబ్యూటర్లు కోలుకోలేదనుకుంటే.. థగ్ లైఫ్‌తో వారిని మరింత కుంగదీసాడు కమల్ హాసన్. శంకర్, మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ల టేకింగ్ అండ్ మేకింగ్‌కు దండం పెడుతున్నారు లోకల్ ఆడియన్స్. వీళ్లే కాదు.. ఉళగనాయగన్ కూడా రెస్ట్ తీసుకుంటే బెటర్ అన్న సలహాలు ఇస్తున్నారు. కానీ కమల్ ఈవన్నీ లైట్‌గా తీసుకుంటున్నారు. అసలే సుదీర్ఘమైన సినిమా ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఈ సీనియర్ యాక్టర్.. ఓ పట్టాన యాక్టింగ్‌కు బ్రేకులు వేయమంటే వేస్తారా..? నో వే.. ఆయన బ్రతికి ఉన్నంత కాలం అలరిస్తూనే ఉంటానని శపథం పట్టారు. అయితే కొత్త డెసిషన్స్ తీసుకోబోతున్నారట.
Also Read:Dimple Hayathi: శారీలో చందమామలా.. డింపుల్ పిక్స్ చూడాల్సిందే!
ఇండియన్ 2నే ఎవరూ చూడలేదంటే.. ఇండియన్ 3ని కంప్లీట్ చేస్తున్నారు కమల్. కొన్ని సాంగ్స్, కొంత షూటింగ్ పెండింగ్‌లో ఉందట. పూర్తయిన తర్వాత ఇయర్ ఎండింగ్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అయితే ఈ మధ్య కమల్ రాజసభ సభ్యుడిగా సరికొత్త బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో కొత్త నిర్ణయం తీసుకున్నారట. ఇకపై తన నిర్మాణ సంస్థ రాజ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌లో తప్ప ఇతర ప్రొడక్షన్ హౌస్‌లో నటించాలని అనుకోవడం లేదట. తన రెస్ట్‌లెస్ షెడ్యూల్ వల్ల ఇతర ప్రొడ్యూసర్లకు నష్టం వాటిల్లకూడదనే ఈ డెసిషన్ తీసుకుంటున్నారట లోక నాయకుడు.
Also Read:Tollywood: తెలుగు మీద కన్నేస్తున్న తమిళ, మలయాళ, కన్నడ హీరోలు
ప్రజెంట్ కమల్ హాసన్ అన్బిరవ్ దర్శకత్వంలో కమల్ 237 ఫిల్మ్ చేస్తున్నాడు. ఆగస్టు ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ నుంచి ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు టాక్. దీనితో పాటు ఆయన చేతిలో కల్కి 2 ఉంది. ఈ రెండు ఇతర ప్రొడక్షన్ హౌస్ చిత్రాలే కావడంతో.. కల్కి 2 తర్వాత బయట నిర్మాణ సంస్థల్లో వర్క్ చేయకూడదని నిబంధన కమల్ పెట్టుకున్నారన్న టాక్ కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరి ఇతర ప్రొడక్షన్ హౌస్ నుంచి బిగ్ ఆఫర్లు వస్తే చేయరా..? చేయాల్సి వస్తే… రాజ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లోనే చేయాలన్న కండిషన్ పెడతారా..? చూడాలి ఈ సీనియర్ యాక్టర్ ఏం చేస్తారో…?