NTV Telugu Site icon

Kamal Haasan : ఈ వయసులో క్లాసులకు వెళ్తున్న కమల్.. ఎందుకో తెలుసా?

Kamal Haasan

Kamal Haasan

Kamal Haasan to Attend AI Short Term Course: భారతీయ సినీ చరిత్రలో అత్యుత్తమ సినీ నటులలో ఒకరైన కమల్ హాసన్ సాధించిన విజయాలు అన్ని ఇన్ని కావు. ఇన్నేసి విజయాలు సాధించిన తర్వాత కూడా కొత్త విషయాలను నేర్చుకోవడం ఆయన ఆపలేదు. 60 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న నటుడు కమల్ హాసన్ ఇటీవల “భారతీయుడు 2” – “కల్కి 2898 AD” చిత్రాలలో కనిపించారు. అందులో కల్కి సినిమాలో ఆయన చేసిన పాత్ర చిన్నది ఆయన కనిపించిన కొద్దిసేపే భలే ఉన్నాడే ఎంతైనా కమలహాసన్ కదా అనేలా నటించాడు. అయితే ఆయన ప్రధాన పాత్రలో చేసిన భారతీయుడు 2 సినిమా మాత్రం దారుణ డిజాస్టర్ గా నిలవడమే కాక ఇదేంటి శంకర్ ఇలాంటి సినిమా చేశాడు అనిపించేలా చేసింది..

Home Minister Anitha: ప్రకాశం బ్యారేజీ కుల్చి వేతకు కుట్ర..! వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి..

ఇలా పరస్పర విరుద్ధమైన ఫలితాల అనంతరం ఇప్పుడు కమలహాసన్ ఆసక్తికరంగా తిరిగి క్లాసులకు హాజరు కావడానికి సిద్ధమయ్యాడు. అదేంటి ఈ వయసులో ఆయన క్లాసులకు వెళ్లి ఏం చేస్తాడు? అని ఆశ్చర్య పోకండి. అసలు విషయం ఏమిటంటే ఆయన USAలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సులో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన AI నేర్చుకుని, చిత్రనిర్మాణానికి ఉపయోగించుకోవడానికి షార్ట్ టర్మ్ కోర్సులో చేరాడు. ఈ కోర్సులో చేరేందుకు కమల్ హాసన్ మణిరత్నం “థగ్ లైఫ్” షూటింగ్ నుండి కూడా బ్రేక్ తీసుకున్నాడని తెలుస్తోంది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత, ఆయన “థగ్ లైఫ్” షూటింగ్‌లో జాయిన్ అయ్యి, మిగిలిన వర్క్ పూర్తి చేస్తాడని తెలుస్తోంది. ఇక ప్లానింగ్ ప్రకారం వచ్చే ఏడాది “కల్కి 2898 AD” రెండవ భాగంలో షూట్ ప్రారంభిస్తారు..

Show comments