Kamal Haasan: కన్నడ వ్యాఖ్యల దుమారం.. థగ్ లైఫ్ కోసం హైకోర్టు కెక్కిన కమల్‌హాసన్..
- కమల్ హాసన్ ‘‘కన్నడ’’ వ్యాఖ్యల వివాదం..
- సినిమాను అడ్డుకుంటామన్న కన్నడ సంఘాలు..
- థగ్ లైఫ్ విడుదల కోసం హైకోర్టును ఆశ్రయించిన స్టార్ హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamal Haasan: యాక్టర్ కమల్ హాసన్ లెటెస్ట్ మూవీ ‘‘థగ్ లైఫ్’’ కర్ణాటకలో వివాదాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల ప్రమోషన్ కార్యక్రమంలో ‘‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’’ అంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకుంటే రాష్ట్రంలో సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, తాను తప్పు చేశానని భావిస్తేనే క్షమాపణలు చెబుతానని కమల్ హాసన్ స్పష్టం చేశారు. క్షమాపణలు చెప్పడానికి నిరాకరించడంతో ఈ సినిమా విడుదలపై అనుమానాలు నెలకున్నాయి. మరోవైపు, సినిమా రిలీజ్‌కి అనుమతించబోమని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC), థగ్ లైఫ్ విడుదలను నిషేధించింది. కమల్ హాసన్ 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని అల్టిమేటం జారీ చేసింది.
Read Also: IPL Final: ఐపీఎల్ ఫైనల్‌పై రాజకీయం.. బీసీసీఐ నిర్ణయంపై తృణమూల్ ఆగ్రహం..
Also Read
అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 05న విడుదల కాబోతున్న తన సినిమాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటానికి చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును కోరారు. కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్లో, కమల్ హాసన్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ, చలనచిత్ర వాణిజ్య సంస్థలు సినిమా విడుదలను అడ్డుకోవద్దని ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ ప్రదర్శనకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌కు సూచనలు ఇవ్వాలని కూడా పిటిషన్లో కోరారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!