Site icon NTV Telugu

Kamal Haasan: కన్నడ వ్యాఖ్యల దుమారం.. థగ్ లైఫ్ కోసం హైకోర్టు కెక్కిన కమల్‌హాసన్..

Kamal Haasan Speech At Thug

Kamal Haasan Speech At Thug

Kamal Haasan: యాక్టర్ కమల్ హాసన్ లెటెస్ట్ మూవీ ‘‘థగ్ లైఫ్’’ కర్ణాటకలో వివాదాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల ప్రమోషన్ కార్యక్రమంలో ‘‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’’ అంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకుంటే రాష్ట్రంలో సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, తాను తప్పు చేశానని భావిస్తేనే క్షమాపణలు చెబుతానని కమల్ హాసన్ స్పష్టం చేశారు. క్షమాపణలు చెప్పడానికి నిరాకరించడంతో ఈ సినిమా విడుదలపై అనుమానాలు నెలకున్నాయి. మరోవైపు, సినిమా రిలీజ్‌కి అనుమతించబోమని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC), థగ్ లైఫ్ విడుదలను నిషేధించింది. కమల్ హాసన్ 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని అల్టిమేటం జారీ చేసింది.

Read Also: IPL Final: ఐపీఎల్ ఫైనల్‌పై రాజకీయం.. బీసీసీఐ నిర్ణయంపై తృణమూల్ ఆగ్రహం..

అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 05న విడుదల కాబోతున్న తన సినిమాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటానికి చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును కోరారు. కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌లో, కమల్ హాసన్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ, చలనచిత్ర వాణిజ్య సంస్థలు సినిమా విడుదలను అడ్డుకోవద్దని ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ ప్రదర్శనకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌కు సూచనలు ఇవ్వాలని కూడా పిటిషన్‌లో కోరారు.

Exit mobile version