ప్రజంట్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’. లోక నాయకుడు కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో 38ఏళ్ల తర్వాత వస్తున్న ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై ఎన్.సుధాకర్‌రెడ్డి ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తుండగా, ఇందులో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా, శింబు ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో మేకర్స్ కూడా ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇందులో భాగంగా ఈ నెల 17న అంట ఈ సినిమా ట్రైలర్‌ని ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read :Naga Chaitanya : నాగచైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి..
అయితే తాజాగా ఈ రోజు మే 17 సాయంత్రం 5 గంటలకు ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్లు ఇప్పుడు మేకర్స్ అనౌన్స్ చేసేసారు. అన్ని భాషల్లో కూడా ఇదే సమయానికి ట్రైలర్ రానుంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అలాగే మద్రాస్ టాకీస్ వారు నిర్మాణం వహించారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ఎంతో ఆకట్టుకోగా, టీజర్స్‌తో మాత్రం సినిమా టాపిక్ ఏంటీ అనేది అర్ధం కాకుండా గోప్యంగా ఉంచారు. ఇవన్నీ ట్రైలర్ చూస్తే తప్ప ఒక క్లారిటీ వచ్చేలా లేదు. అందుకే ఈ ట్రైలర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఫైనల్ గా ఈ ట్రైలర్ రిలీజ్ కి టైం లాక్ అయ్యింది.