NTV Telugu Site icon

Kalki : ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ !

Kalki 2 (2)

Kalki 2 (2)

ప్రజంట్ ప్రభాస్ లైన‌ప్ లో ఉన్నపెద్ద సినిమాల‌లో ‘క‌ల్కి 2’ కూడా ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో దిశా పటానీ, రాజేంద్రప్రసాద్, శోభన, బ్రహ్మానందం, పశుపతి, అన్నా బెన్, కావ్యా రామ చంద్రన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు కలెక్షన్స్ లోనూ సరికొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేసిన ఈ మూవీ కి సంబంధించిన అఫీషియ‌ల్ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ ప‌నుల‌లో ఆయ‌న బిజీగా ఉండగా, తాజాగా అమితాబ్ బచ్చన్ ఈ సీక్వెల్ పై ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

Also Read: Mohan Babu : సినీ కెరీర్‌లో యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న మోహన్ బాబు

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ పూర్తి చేసిన తర్వాత ‘కల్కి 2’ షూటింగ్ లో పాల్గొంటానన్నారట. ఈ క్రేజీ సీక్వెల్ మూవీ షూటింగ్ మే నెలలో ప్రారంభమవుతుందని, జూన్ 15 వరకు షెడ్యూల్ కొనసాగుతుందని తెలిపారు.  ఆ మధ్య కాలంలో నిర్మాతలు స్వప్న- ప్రియాంక మాట్లాడుతూ.. ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్‌ 2కు సంబంధించి 35 శాతం షూట్‌ జరిగింది’ అని తెలిపారు. ఇక కమాండర్ యాస్కిన్ పాత్ర పోషించిన క‌మ‌ల్ హాస‌న్ సెకండ్ పార్ట్‌లో ప్రేక్షకుల‌కి మ‌రింత ఎంట‌ర్‌టైన్ అందించ‌డం ఖాయం అంటా. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘అశ్వత్థామ’ పాత్రను పోషించ‌గా, సీక్వెల్ లోనూ ఆయన పాత్ర మరింత పవర్ ఫుల్‌గా ఉండనుందని తెలుస్తోంది.