Kalki 2898 AD: 600 కోట్ల సినిమా డైరెక్టర్ చెప్పులేంట్రా ఇలా ఉన్నాయి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD Director Nag Ashwin Slipper Photos goes Viral: ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాతో దర్శకుడిగా మారాడు నాగ్ అశ్విన్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి ఎన్నో సినిమాలకు శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా చేస్తూ ఉన్న సమయంలోనే ఆ సినిమా నిర్మాతలుగా వ్యవహరించిన ప్రియాంక, స్వప్నలలో ప్రియాంకతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత వైజయంతి మూవీస్ బ్యానర్ మీద మహానటి అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమ అంతా తనవైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత సినిమా ఏం చేస్తాడు అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సమయంలో ప్రాజెక్టు కే అనే ప్రకటన చేసి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు.
Kalki 2898 AD : ప్రభాస్ ఫ్యాన్ గా మారిన అకిరా నందన్.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిమరీ!
Also Read
ఎందుకంటే అందులో ప్రభాస్ హీరో అని మాత్రమే కాదు కమల్ హాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకొనే వంటి వాళ్ళు నటిస్తూ ఉండడమే. ఇక సుమారు ఆరేళ్ల కష్టం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ తెగిపోయిన తన చెప్పులను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇట్స్ బీన్ ఏ లాంగ్ రోడ్ అంటూ దానికి క్యాప్షన్ కూడా పెట్టాడు. అంటే పనిలో ఎంత నిమగ్నం అయిపోయాడు అంటే చెప్పులు చిరిగిపోయాయి వాటిని మార్చాలి అని కూడా ఆలోచించలేనంతగా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. 600 కోట్ల బడ్జెట్ సినిమా చేసిన డైరెక్టర్ చెప్పులు ఇలా ఉన్నాయేంటి అనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది.
తాజావార్తలు
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!