Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్‌ బంపర్ ఆఫర్!

Kalki 2 Casting Call

Kalki 2 Casting Call

Kalki 2 Casting Call: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు దేశవ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం పురాణాలు, సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలను మేళవిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో ప్రభాస్‌ భైరవగా, కర్ణుడిగా నటించగా, అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామగా, కమల్‌ హాసన్‌ సుప్రీమ్‌ యాస్కిన్‌గా, దీపికా పదుకొనె సుమతిగా కనిపించారు. ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కల్కి సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగం కావాలనుకునే ఔత్సాహిక నటీనటులకు మేకర్స్‌ ఓ ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నారు. నటనపై ఆసక్తి, ప్రతిభ ఉన్నవారు తమ వివరాలను పంపించాలని అధికారికంగా కాస్టింగ్‌ కాల్‌ ఇచ్చారు.

“ఆస్పైరింగ్‌ యాక్టర్స్‌ అందరికీ ఇదో మంచి అవకాశం. కల్కి సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగం కండి” అంటూ మేకర్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆసక్తి ఉన్న నటీనటులు తమ ప్రొఫైల్‌, నటనకు సంబంధించిన వివరాలను [kalkiuniversecasting@gmail.com](mailto:kalkiuniversecasting@gmail.com)కు పంపించవచ్చు. నాగ్‌ అశ్విన్‌ సృష్టించిన ‘కల్కి’ యూనివర్స్‌లోని కథను మరింత విస్తరించేందుకు సీక్వెల్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. రెండో భాగంలో కథ మరింత ఆసక్తికరంగా ఉండబోతుందనే అంచనాలు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలతో నెలకొన్నాయి. ఇప్పటికే ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ వంటి స్టార్‌ కాస్ట్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యూనివర్స్‌లో కొత్త నటీనటులకు అవకాశం కల్పించడంతో.. నటన రంగంలోకి రావాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఆసక్తి ఉన్నవారు పైన ఇచ్చిన మెయిల్ అడ్రస్‌కి మీ వివరాలను పంపించండి.