టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలోనూ నటిస్తోంది. ప్రవీణ్ సత్తారు-నాగార్జునతో ఓ సినిమా చేస్తోంది. అయితే కాజల్ కు ప్రతిసారి ఏ ఇంటర్వ్యూలోనైనా పదే పదే ఓ ప్రశ్న తనకు ఎదురవుతూనే వుంది. ‘పెళ్లి తర్వాత సినిమాలు ఆపేస్తారా..?’ అనే ప్రశ్నకు కాజల్ మరోసారి తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ‘నా భర్త, కుటుంబ సభ్యుల సహకారం వల్లే నా సినీ కెరీర్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతోంది. కానీ ఇంకా ఎన్ని రోజులు సినిమాల్లో కొనసాగుతానో తెలియదు. ఒకవేళ గౌతమ్ అడిగితే మాత్రం తప్పకుండా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాను’ అని కాజల్ అన్నారు.