Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kajal Aggarwal: సినీ తారల వ్యక్తిగత జీవితాలపై వచ్చే పుకార్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రేమించి పెళ్లి చేసుకుని అన్యోన్యంగా సంసారం సాగిస్తున్నా సరే.. ఏదో ఒక సందర్భంలో ‘విడాకులు’ అనే ముద్ర వేసి రూమర్లు సృష్టించడం నెట్టింట నిత్యకృత్యమైంది. గతంలో నయనతార – విఘ్నేష్ శివన్ దంపతులపై ఇలాంటి ప్రచారం జరిగినప్పుడు జంటగా ఫొటోలు పెట్టి బ్రేక్ వేయాల్సి వచ్చింది. అటు సూర్య – జ్యోతిక విడిపోతున్నారంటూ కథనాలు అల్లినా, ఇటీవలే 20వ వివాహ వార్షికోత్సవాన్ని స్కాట్లాండ్లో ఘనంగా జరుపుకుని ఆ పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టారు. తాజాగా ఈ విభేదాల సెగ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌కి కూడా తాకింది. గౌతమ్ కిచ్లును ప్రేమ వివాహం చేసుకుని, ఓ బాబుకు జన్మనిచ్చిన కాజల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. అయితే కొద్ది రోజులుగా ఓ స్టార్ హీరోయిన్ వైవాహిక బంధం ముగింపు దశకు చేరిందంటూ, అందులో కాజల్ పేరే ఉందంటూ పలు వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికల్లో జోరుగా కథనాలు వెలిశాయి. ఈ ప్రచారంపై కాజల్ నేరుగా రచ్చ చేయకుండా, తనదైన శైలిలో పరోక్షంగా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమాజంలో మారుతున్న బంధాలు, పెరుగుతున్న విడాకుల సంస్కృతిపై కాజల్ మాట్లాడింది. నేటి తరంలో బంధాలు బీటలు వారడానికి సోషల్ మీడియా ప్రభావమే ప్రధాన కారణమని ఆమె స్పష్టం చేసింది. చాలా మంది డిన్నర్‌కు వెళ్లినా ఎదురెదురుగా కూర్చుని ఫోన్లలోనే మునిగిపోతున్నారని, కానీ తమ ఇంట్లో అలాంటి పరిస్థితులకు తావులేదని వెల్లడించింది. “నేనూ నా భర్త ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోన్లను పూర్తిగా పక్కన పెట్టేస్తాం. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటాం, ఒకరి సమయాన్ని మరొకరం గౌరవిస్తాం. స్క్రీన్లకు బానిసలు కాకుండా భాగస్వామితో నాణ్యమైన సమయం గడపడం అలవాటు చేసుకుంటే ఏ బంధమైనా నిలుస్తుంది” అంటూ తమ దాంపత్యం ఎంత పటిష్టంగా ఉందో వివరించింది. ఈ వ్యాఖ్యల ద్వారా తమ మధ్య ఎలాంటి కలతలు లేవని, విడాకుల వార్తలన్నీ నిరాధారమైనవని పరోక్షంగా తేల్చిచెప్పింది. కెరీర్ విషయానికొస్తే.. ‘భగవంత్ కేసరి’ బ్లాక్‌బస్టర్ తర్వాత మరోసారి నందమూరి బాలకృష్ణ సరసన దాదా చిత్రంలో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని చెప్పడంతో అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌ను సమతుల్యంగా నడిపిస్తూ పుకార్ల రాయుళ్లకు కాజల్ గట్టిగానే సమాధానమిచ్చింది.
Also Read
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!