Site icon NTV Telugu

Malvika Raaj: రహస్యంగా పెళ్లి చేసుకున్న K3G జూనియర్ కరీనా..

Malvika Raaj

Malvika Raaj

బాలీవుడ్ నటి, కే3జీ జూనియర్ కరీనా మాళవిక రాజ్ రహస్యంగా పెళ్లి పీటలు ఎక్కింది. తన ప్రియుడు, వ్యాపారవేత్త ప్రణవ్ బగ్గాను ఆమె పెళ్లాడింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధుమిత్రులు సమక్షంలో నవంబర్ 30 వీరి వివాహక వేడుక గోవాలో ఘనంగా జరిగింది. కాగా ఇటీవల టర్కిలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట తాజాగా మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మాళవిక తన ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసి.. పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించింది. దీంతో ఆమె వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో మాళవిక్ గోల్డ్ ఎంబ్రాయిడరీ వెడ్డింగ్ లెహంగాలో మెరిసిపోయింది.

Also Read: Allu Arjun: ఓ అమ్మాయి కోసం బన్నీ చిరు సాయం.. ఆకట్టుకుంటున్న వీడియో

తన పెళ్లి ఫొటోలను మాళవిక షేర్ చేస్తూ.. ‘మా హృదయాలు పూర్తిగా ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయి’ అంటూ షేర్ చేసింది. దీంతో ఆమెకు ఫ్యాన్స్, ఫ్రెండ్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా మాళవిక జూనియర్ కరీనా కపూర్‌గా పాపులర్ అయ్యింది. 2001లో కరణ్ జోహార్ దర్శకత్వంతో తెరకెక్కిన కబీ ఖుషి కబీ గమ్ సినిమాలో జూనియర్ కరీనాగా పూజ పాత్రలో కనిపించింది. ఈ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొందిన పూజా ఆ తర్వాత యాక్షన్, థ్రిల్లర్ మూవీ స్వాడ్‌లో కనిపించింది. ఇందులో ఆమె డానీ డెంజోంగ్పా కుమారుడు రింజిన్ డెంజోంగ్పా సరసన నటించింది. ఆ తర్వాత ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి స్టడీస్‌పై దృష్టి పెట్టింది.

Also Read: Nani: విజయ్- రష్మిక ప్రైవేట్ ఫొటోస్.. అందరి ముందు లీక్ చేసిన నాని.. ?

Exit mobile version