Site icon NTV Telugu

K Ramp : కే ర్యాంప్ మూవీ ట్వీటర్ రివ్యూ..

Kiran Abavara K Ramp

Kiran Abavara K Ramp

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెండెట్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కే ర్యాంప్’. హీరోయిన్ యుక్తి తరేజా కథానాయికగా, సీనియర్ నటులు వీకే నరేష్, కామ్నా జెఠ్మలానీ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి జైన్స్ నాని దర్శకత్వం వహించగా.. ఇప్పటికే ప్రోమోలు, టీజర్, ట్రైలర్లకు భారీ స్పందన రాగా.. హీరో కిరణ్ అబ్బవరం, వీకే నరేష్ చేసిన ప్రమోషన్స్ బాగా వర్కవుట్ కావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. కాగా ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా నేడు అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైంది. ఇక మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్‌గా రూపొందిన ఈ మూవీ తొలి షో.. పై ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూదాం..

Also Read : Krithi Shetty : కృతిశెట్టి కలల మీద నీళ్లు చల్లిన బాలీవుడ్ !

ఈ సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్, ప్రేక్షకులు ఎలాంటి అభిప్రాయాలను, రివ్యూలను పోస్ట్ చేశారంటే.. సినిమా ఫస్ట్ హాఫ్‌లో కామెడీ, కాలేజీ సీన్స్, ఎగ్జామ్ ఎపిసోడ్, ఇంటర్వెల్ బ్లాక్ చక్కగా ఆకట్టుకుంటాయి. హాస్పిటల్ సీన్, వీకే నరేష్-వెన్నెలకిషోర్ కాంబినేషన్ సీన్స్, డైలాగ్స్, ఎమోషనల్ కనెక్ట్ అందరిలో సానుభూతిని రేకెత్తిస్తున్నాయి. చేతన్ భరద్వాజ్ సంగీతం సినిమాకు మంచి ప్లెస్ అయిందట. మొత్తం సినిమాను వేగంగా సాగించే స్క్రీన్ ప్లే, ఎంటర్టైనింగ్ సెకండ్ హాఫ్, కామెడీ ఎలిమెంట్స్ బలంగా ఉన్నాయి. కాగా కే ర్యాంప్ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ, కిరణ్ అబ్బవరంకు మరో హిట్ పడే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version