Site icon NTV Telugu

Jyothi Poorvaaj: ‘బిగ్ బాస్’లోకి హాట్ ఆంటీ?

Jyothi In Bb8 Telugu

Jyothi In Bb8 Telugu

Jyothi Poorvaaj in Bigg Boss Telugu 8: ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఎనిమిదవ సీజన్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది. షో మొదలవడానికి ఇంకా సమయం ఉంది కానీ ఇప్పటినుంచే ఎంపికలు సెషన్ నడుస్తోంది. నాగార్జున హోస్ట్ చేయబోతున్న ఈ సీజన్లో ఆసక్తికరమైన వ్యక్తులను పంపి టిఆర్పి ప్రధానంగా షో నడిపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఒక కొత్త పేరు లిస్టులో ఆడ్ అయింది. ఆమె ఇంకెవరో కాదు జ్యోతి రాయ్ అలియాస్ జ్యోతి పూర్వజ్. తెలుగులో గుప్పెడంత మనసు అనే సీరియల్ తో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. అందులో హీరో తల్లి పాత్రలో ఆమె అలరించింది.

Prabhas Fauji: ప్రభాస్ కోసం కొత్త భామ.. ఎవరీ ఇమాన్వి.. ఇంత క్యూట్ గా ఉందేంటి?

అయితే అంతకు మునుపే ఆమె కన్నడలో అనేక సీరియల్స్ చేసింది. తెలుగులో సుక్కు పూర్వజ్ అనే దర్శకుడుతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. బుల్లితెర మీద ఎంత పద్ధతిగా కనిపిస్తుందో సోషల్ మీడియాలో దానికి భిన్నంగా అందాలు ఆరబోస్తూ కనిపించడం ఆమె స్పెషాలిటీ. ఈ లేటు వయసు భామ హాట్ హాట్ ఫోటోషూట్లు చేస్తూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలలోకి వస్తోంది. అయితే ఆమె బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇప్పటికే విష్ణు ప్రియ, రీతు చౌదరి లాంటి హాట్ భామలు లోపలకి వెళ్లబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వాళ్లకు జ్యోతి కూడా తోడైతే ఇక ఈ సీజన్ హాట్ నెస్ కి ఏ మాత్రం ఢోకా లేదని ప్రచారం జరుగుతోంది. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ ఏడాది సీజన్ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది.

Exit mobile version