జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేర మెప్పించలేకపోయింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఎలా చూస్తున్నారంటూ తెలుగుదేశం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడినట్లుగా ఉన్న ఒక ఆడియో వైరల్ అయింది. అది తన ఆడియో కాదని, ఎవరో కావాలని కుట్ర చేసి తన ఆడియోగా సృష్టించారని ఇప్పటికే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ సంగతి అలా ఉంచితే, ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
Also Read:Kajol Devgan : కాజోల్ దేవగన్.. హాట్ ఫొటోస్ లో సొగసులు అదిరెన్
ఎమ్మెల్యే చేసినట్లుగా భావిస్తున్న వ్యాఖ్యల మీద మాట్లాడాలని భావించింది. అయితే మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ అనారోగ్య కారణాలతో కన్నుమూసిన కారణంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి రెండున్నరకు ఈ ప్రెస్ మీట్ నిర్వహించాలని భావించారు. మీడియా ప్రతినిధులు అందరూ చేరుకున్నా, వారు చేరుకోకపోవడంతో అసలు ఏమైందని ఆరా తీయగా ఈ మేరకు సమాధానం వచ్చింది. రేపు వారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.
