జులై మాసం ముగిసింది. గత నెలలో టాలీవుడ్ లో స్ట్రయిట్ సినిమాలోతో పాటు, డబ్బింగ్ సినిమాలు చాలా విడుదలయ్యాయి. వాటిలో చెప్పుకోదగ్గ సినిమా అంటే కమల్ హసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు-2. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫ్లాప్ గా మిగిలింది. ఇక చిన్న సినిమాలలో కాసింత బజ్ క్రియేట్ చేసిన చిత్రం ప్రియదర్శి నటించిన డార్లింగ్. మెుదటి షో నుండే అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చకుంది ఈ సినిమా. వీటితో పాటు పేక మేడలు, ఆపరేషన్ రావణ్, రాజ్ తరుణ్ పురుషోత్తముడు వంటి సినిమాలన్ని మైదాపిండి ఖర్చులు కూడా రాబట్టలేదు. జులై చివర్లో వచ్చిన మరో డబ్బింగ్ చిత్రం రాయన్. జులై 26న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇక హలీవుడ్ చిత్రం డెడ్ పూల్ కూడా హిట్ టాక్ సాధించింది. జులై మెుత్తంగాను రాయన్ మాత్రమే హిట్. స్ట్రయిట్ సినిమాలేవి హిట్ కొట్టలేక పోయాయి.
Also Read: Tollywood: ఒక్క క్లిక్ మూడు టాప్ అప్ డేట్స్.. అవేంటంటే..?
రానున్న ఆగస్టు నెలపై టాలీవుడ్ గంపెడు ఆశలు పెట్టుకొంది. ఆగస్టు 1న శివం భజే రిలీజ్ కానుంది. ఆ వెంటనే అరడజను చిన్న సినిమాలు రానున్నాయి. కీలకమైన 15న విడుదలయ్యే రామ్ డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్తర్ బచ్చన్, 16న ఆయ్ చిత్రాల రిజల్డ్ పై అందరి చూపు ఉంది. ఇవి హిట్ అయితేనే థియేటర్లకు కాసింత బూస్ట్ దొరుకుతుంది. ఇక ఇదే నెల ఆఖరున నాని సరిపోదా శనివారంపైన కూడా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఆశగా ఉన్నారు.. మరి వీటిలో బాక్సాఫీస్ కు కళ తెచ్చేది ఎవరో మరికొద్ది రోజుల్లో తేలనుంది.