NTV Telugu Site icon

Jr.NTR : దేవర టార్గెట్ ఎంత.. రాబట్టింది ఎంత..?

Devra Strom

Devra Strom

యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన  దేవర సూపర్ హిట్ టాక్ తో దుసుకెళ్తోంది. రిలీజ్ కు ముందు భారీ హైప్ తో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుండి భారీ కలెక్షన్స్ రాబడుతూ విడుదలై పది రోజులైనా కూడా స్టడీగా వసూళ్లు నమోదు చేస్తోంది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్,  సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ టైమ్ లో తొలగించిన సాంగ్, కొన్ని సీన్స్ కు మరల యాడ్ చేయడంతో మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది.

Also Read : JR.NTR : ఏపీ – తెలంగాణ దేవర 10 రోజుల కలెక్షన్స్.. మాస్ దంచుడు

దేవర రెండు తెలుగు రాష్టాల హక్కులను  నాగ వంశి కొనుగోలు చేసారు.  సితార్ ఎంటర్టైన్మెంట్స్ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లతో అన్ని ఏరియాల కలిపి రూ. 112.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది దేవర. సూపర్ హిట్ టాక్ తో కేవలం మొదటి 10 డేస్ లోనే ఆ టార్గెట్ దాటి రూ. 135.83 కోట్లు రాబట్టింది. దేవరను కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి లాభాలే అనిచెప్పాలి. అటు హిందీ లోను దేవర విజయయాత్ర కొనసాగుతుంది.  ఇప్పటికే అక్కడ లాభాల బాటలో ఉంది. ఓవర్సీస్ సంగతి చెప్పక్కర్లేదు. లాంగ్ రన్ లో నార్త్ అమెరికాలో 7 మిలియన్ కలెక్ట్ చేసిన ఆశ్చర్యం లేదని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇటు తెలుగులోను మరే స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ లేకపోవడంతో దసరా సీజన్ ను దేవర ఫుల్ గా క్యాష్ చేసుకుంటాడని టాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుల టాక్. ఓవరాల్ గా మొదటి పది రోజులకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 25 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి.

 NOTE : బాక్స్ ఆఫీస్ డేటా వివిధ మూలాల నుండి సంకలనం చేయబడింది.  అయితే, ఈ డేటా యొక్క ప్రామాణికతకు మేము ఏ విధంగానూ బాధ్యత వహించము.