Site icon NTV Telugu

Jr NTR Fan: క్యాన్సర్ తో అంపశయ్యపై అభిమాని.. దేవర వీడియో కాల్

Jr Ntr

Jr Ntr

Jr NTR Video Call to his Fan Suffering WIth Cancer: కొంతకాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏపీకి చెందిన కౌశిక్‌ (19) అనే యువకుడు.. చనిపోయేలోపు ఎన్టీఆర్‌ తాజాగా నటించిన దేవర సినిమాను చూడాలనుకుంటున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన కౌశిక్‌ కి దేవర సినిమా చూడడమే చివరి కోరిక. ఎన్టీఆర్‌ అంటే కౌశిక్‌కు చిన్నప్పటినుంచి పిచ్చి అని అతని తల్లిదండ్రులు తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు. ‘చిన్నప్పటినుంచి ఎన్టీఆర్‌ అంటే కౌశిక్‌కు చాలా ఇష్టం, నా కొడుకు బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్నాడు. అయినా కూడా దేవర సినిమా చూడాలనుకుంటున్నాడు, సెప్టెంబర్‌ 27 వరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు. దేవర చూడడమే కౌశిక్‌ ఆఖరి కోరిక’ అని ఆయన తల్లి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయింది.

Krithi Shetty: ఆ పుస్తకం వల్లే ఇంత అందం.. కృతి శెట్టి బ్యూటీ సీక్రెట్ లీక్

తన కుమారుడి వైద్యానికి రూ.60 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని, ప్రభుత్వం, దాతలు తమకు సాయం చేయాలని కోరారు. ఈ విషయం ఎన్టీఆర్ దాకా వెళ్లి కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడాడు ఎన్టీఆర్. అభిమాన సంఘం నేతల ద్వారా ఈ వీడియో కాల్ మాట్లాడాడు. నవ్వుతుంటే బాగున్నావని ఎన్టీఆర్ కౌశిక్ ను ఉద్దేశించి అనగా మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదని వెల్లడించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతు భలేవాడివి, నేను మాట్లాడక పోతే ఎలా అని అంటూనే ఎలా ఉన్నావని అడిగాడు. బాగున్నానని అంటే వెరీ గుడ్, నువ్వు క్యాన్సర్ ను దాటి రావాలి. దేవర సినిమా చూడాలని ఎన్టీఆర్ అన్నారు. అలాగే ఈ సినిమా అవన్నీ తరువాత ముందు నీ ఆరోగ్యం బాగుండాలని అన్నారు. ఒక్కసారైనా కలవాలని ఉంది అంటే ఖచ్చితంగా కలుస్తానని ఆమె అన్నారు.

Exit mobile version