NTR : బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలి!

Ntr Balakrishna

Ntr Balakrishna

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ అటెస్టెడ్ క్రేజీ ప్రాజెక్ట్ #NBK111 షూటింగ్ సమయంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.ఈ షెడ్యూల్‌లో భాగంగా చిత్ర యూనిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తోంది. ఈ షూటింగ్ లో బాలకృష్ణకు చిన్నపాటి ‘మసిల్ టియర్’ అయినట్లు దర్శకుడు గోపీచంద్ మలినేని స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గాయం తీవ్రతను నిపుణులైన వైద్యులు పరిశీలించి, ఆయన త్వరగా, పూర్తిగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ అవసరమని సూచించినట్లు తెలిపారు.

బాలయ్య బాబుకు గాయమయిందన్న వార్త ఇండస్ట్రీలో దావానలంలా ట్రెండ్ అవుతుండగా, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వెంటనే స్పందించారు. బాలయ్య బాబు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

“గెట్ వెల్ సూన్ బాలా బాబాయ్. మీరు త్వరగా కోలుకుని మంచి ఆరోగ్యంతో, మునుపటి కంటే పవర్ ఫుల్ రూపంలో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…” అంటూ తారక్ పోస్ట్ చేయడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

ప్రస్తుతం బాలయ్య బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చిన్నపాటి చికిత్స అనంతరం ఆయన మరింత పవర్‌ఫుల్‌గా సెట్స్‌లోకి అడుగుపెడతారని యూనిట్ స్పష్టం చేసింది. నందమూరి అభిమానులు తమ హీరో త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.