NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ – సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ అత్యంత భారీ చిత్రంపై అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి చిత్రాలతో మాస్ పల్స్ పట్టుకున్న నీల్, ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను ఏ రేంజ్లో చూపిస్తారు అనే ఆసక్తి తారక్ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినిమా అభిమానుల్లో కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా #NTRNeel నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సముద్ర తీరాన నిలబడి ఉన్న పవర్ఫుల్ ఇమేజ్ను షేర్ చేశారు. అయితే ఇందులో అందరినీ ఆకర్షించింది మాత్రం సినిమా ట్యాగ్‌లైన్. గతంలో “You know the business and I know the chemistry” అని ఉన్న వాక్యాన్ని మార్చి, ఇప్పుడు “You know the vision.. and I know the storm” (నీకు విజన్ తెలుసు.. నాకు తుఫాను తెలుసు) అనే కొత్త ఫ్రేజ్‌ను జోడించారు. ఈ మార్పు సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మే 20 (తారక్ పుట్టినరోజు) నాడు ఈ చిత్రానికి సంబంధించిన భారీ అప్డేట్స్ రానున్నాయి. ఆ రోజున సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వాసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
Y̶o̶u̶ ̶k̶n̶o̶w̶ ̶t̶h̶e̶ ̶b̶u̶s̶i̶n̶e̶s̶s̶
a̶n̶d̶ ̶I̶ ̶k̶n̶o̶w̶ ̶t̶h̶e̶ ̶c̶h̶e̶m̶i̶s̶t̶r̶y̶.̶.These two are known to rewrite everything… And so did this phrase 🤫🔥
Wait for May 20th…. #NTRNeel pic.twitter.com/Vuf3XBecsn
— #NTRNeel (@NTRNeelFilm) May 14, 2026
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు