NTV Telugu Site icon

Ram : అబ్బాయ్ ‘నందమూరి రామ్’ కు బాబాయ్ ల బెస్ట్ విషెస్

Ntr Ram

Ntr Ram

నందమూరి నాలగవ తరం నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు స్వర్గీయ నందమూరి జానకి రామ్ కుమారుడు నందమూరి తారక రామారావు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో బొమ్మరిల్లు ప్రొడక్షన్ లో ఈ సినిమాను నిర్మిచనున్నాడు. నేడు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసాడు వైవీఎస్ చౌదరి. పెద్దాయన నందమూరి తారక రామారావు అశీసులతో యంగ్ ఎన్టీఆర్ ను హీరోగా పరిచయం చేస్తున్నానని తెలిపాడు.

ఈ సందర్భంగా  జూనియర్ ఎన్టీఆర్ తన అన్నకొడుకైన యంగ్ ఎన్టీఆర్ కు విశేష్ తెలిపారు. తన వ్యక్తిగత ‘X’ ఖాతాలో ” చిత్ర పరిశ్రమలో మొదటి అడుగులు వేస్తున్న నీకు ఆల్ ది బెస్ట్ రామ్. సినిమా ప్రపంచం నిన్ను ఆదరించడానికి లెక్కలేనన్ని క్షణాలను అందజేస్తుంది. మీకు విజయం తప్ప మరేమీ కాదు! మీ ముత్తాత ఎన్టీఆర్, తాత హరికృష్ణ, నాన్న జానకిరామ్ అన్నల ప్రేమ, ఆశీస్సులతో నువ్వు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న నమ్మకం నాకుంది. షైన్ ఆన్ మై బాయ్” అని శుభాకాంక్షలు తెలియజేసారు.

నందమూరి కళ్యాణ్ రామ్ ” నా ప్రియమైన రామ్‌కి శుభాకాంక్షలు, నువ్వు మీ తొలి సినిమాతో మా అందరినీ గర్వపడేలా చేస్తారని మరియు నీ సినీ కెరీర్‌లో చాలా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను, నీకు తాత తారక రామారావు, నా అన్న జానకి రామ్ అశీసులు ఎల్లప్పుడు ఉంటాయి. ఆల్ ది బెస్ట్ రామ్” అని ట్వీట్ చేస్తూ యంగ్ హీరోకు శుభాకాంక్షలు తెలియజేసారు.

Show comments