Site icon NTV Telugu

Jr NTR Injured: ఎన్టీఆర్‌కు గాయాలు.. షాక్ లో ఫాన్స్!

Jr Ntr

Jr Ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం అనే న్యూస్ నందమూరి అభిమానులను కలవరపెడుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే కర్ణాటక, హైదరాబాద్‌లో కొన్ని కీలక షెడ్యూల్స్ చిత్రీకరించారు. త్వరలోనే విదేశాల్లో షూటింగ్‌కు రెడీ అవుతున్నారు. రీసెంట్‌గాగా ఎన్టీఆర్ వర్కౌట్ వీడియో ఒకటి బయటికి రాగా.. సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. సిక్స్ ప్యాక్ బాడీతో అదిరిపోయే లుక్‌లో ఉన్నాడు టైగర్. ఆయన డెడికేషన్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. ప్రశాంత్ నీల్ సినిమాలో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఎన్టీఆర్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు.

Also Read :Kiran Abbavaram: మా అన్న రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు.. మీ ప్రాణాల కోసం రూల్స్ పాటించండి

అయితే, ప్రజెంట్ డ్రాగన్ సినిమా షూటింగ్ స్మాల్ షెడ్యూల్‌లో బ్రేక్‌లో ఉంది. దీంతో.. ఎన్టీఆర్ హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నట్టుగా తెలిసింది. ఈ షూటింగ్‌లో భాగంగా ఆయన కాలు జారిపడినట్టు, సమాచారం. స్వల్పంగా గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో భయపడాల్సిన పని లేదని రెండు రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పారని అంటున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తునే.. మరోవైపు కమర్షియల్‌గా కూడా ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు. పలు బడా సంస్థలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, లేటెస్ట్ యాడ్ ఏంటి? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఎన్టీఆర్‌కు గాయాలు అనే వార్తతో ఆయన అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Exit mobile version