Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR: గత కొన్ని రోజులుగా గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటూ కెమెరాలకు, షూటింగ్‌కి దూరంగా ఉంటున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు అభిమానుల ముందుకు రాబోతున్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆయన హాజరవుతున్న ఫస్ట్ పబ్లిక్ ఈవెంట్ ఇదే కావడం విశేషం. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కుటుంబంతో తారక్‌కు ఉన్న స్పెషల్ బాండింగ్ అందరికీ తెలిసిందే. ఈ అనుబంధం, స్నేహం కోసమే తారక్ తాజా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాతగా మారి ఆర్కా మీడియా వర్క్స్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “డోంట్ ట్రబుల్ ది ట్రబుల్” . విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల చేతికి గాయం కావడంతో కొన్ని వారాల పాటు పూర్తిగా ఇంటికే పరిమితమైన ఎన్టీఆర్, కార్తికేయ నిర్మిస్తున్న సినిమా ప్రమోషన్లకు తన వంతు సహకారం అందించేందుకు రెడీ అయ్యారు.
ఈ భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. గాయం తర్వాత తారక్ మొదటిసారి వేదికపైకి వచ్చి మైక్ పట్టుకోనుండటంతో టైగర్ ఫ్యాన్స్‌లో జోష్ కనిపిస్తుంది. ఈ వేదికపై ఎన్టీఆర్ ఇచ్చే స్పీచ్, ఆయన ఎనర్జీ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. శశాంక్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షిస్తోంది. డబ్బు, వ్యక్తిగత సమస్యలతో సతమతమయ్యే ఒక సాధారణ వ్యక్తి జీవితంలోకి ఓ చిన్న పాప ప్రవేశించిన తర్వాత ఎలాంటి అద్భుతం జరిగింది? అనే ఎమోషనల్ అండ్ ఫాంటసీ స్టోరీతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్ ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తుండటం, దానికి తోడు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతుండటంతో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రాజెక్ట్‌పై హైప్ ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది.
Also Read
- Chiranjeevi – Odela Movie: 'కాకా' తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
- Satya Master: "నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?" జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
- Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
- Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
Annaaaaaaaa….❤️❤️❤️
Here comes my APOCALYPTIC MASS HURRICANE moment 🤗🤗🤗@tarak9999 anna is coming to meet us all after a long time… ❤️
Let’s have some amazing evening together on Sep 29th 🙂#DontTroubleTheTrouble #DTTTMovie #DTTTonOct2nd pic.twitter.com/8Qplghr0x7— S S Karthikeya (@ssk1122) September 26, 2026
తాజావార్తలు
-
Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
-
Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
-
Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
-
Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
-
UP Elections: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం.. లేటెస్ట్ సర్వేలో వెల్లడి..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?