Site icon NTV Telugu

Jr NTR: ఏంటి.. ఎన్టీఆర్ చొక్కా కాస్ట్ అన్ని వేలా?

Jr Ntr

Jr Ntr

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక సినిమా లొకేషన్‌లో ఉన్నాడు. ఈ మధ్యనే ‘వార్ 2’ సెకండ్ పార్ట్ షూటింగ్‌లో పాల్గొన్న ఆయన, తనకు సంబంధించిన షూటింగ్‌ను ముగించాడు. ఈ నెల 22వ తేదీ నుంచి ఎన్టీఆర్-నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది. 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న షెడ్యూల్‌లో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొననున్నాడు. అయితే, అప్పటివరకు గ్యాప్ ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్‌కు వెళ్లాడు.
ఈ వెకేషన్‌లో ఆయన బస చేసిన హోటల్ స్టాఫ్ ఆయనతో కలిసి ఒక ఫోటో దిగారు. ఆ ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన షర్టు ఎట్రో కంపెనీదని కాస్ట్ 85 వేల రూపాయలని నెటిజన్లు తేల్చారు.

Tollywood : టాలీవుడ్ లోకి బాలీవుడ్ భామలు.. సౌత్ హీరోయిన్లపై ఎఫెక్ట్..?

జూనియర్ ఎన్టీఆర్ షర్టు చూసి, అలాంటి షర్టు దొరుకుతుందేమోనని చూసిన ఒక నెటిజన్, దాని రేటు ఏకంగా 85,000 రూపాయలని తెలిసి షాక్ అయ్యాడు. కొంతమంది, “అది మా రెండు నెలల జీతం” అని కామెంట్ చేస్తుంటే, మరికొంతమంది, “జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ ఆ మాత్రం మెయిన్‌టైన్ చేస్తే తప్పేంటి?” అని కామెంట్ చేస్తున్నారు. మొత్తంమీద, ఆ షర్టు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇక ఈ దుబాయ్ వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే, జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నాడు.

Exit mobile version