Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?

Jr Ntr Dragon

Jr Ntr Dragon

Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డ్రాగన్’. అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం.. రవి బస్రూర్‌తో పాటు మరో సంచలన సంగీత దర్శకుడు కూడా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రీసెంట్‌గా ‘ధురంధర్’ సినిమాకు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శశ్వత్ సింగ్ సచ్‌దేవ్‌ను కూడా డ్రాగన్ కోసం రంగంలోకి దించుతున్నారట.

ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది ఒకవైపు రవి బస్రూర్ హెవీ మెటల్ మ్యూజిక్, మరోవైపు శశ్వత్ సింగ్ మార్క్ ఆర్ఆర్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అయితే ఈ క్రేజీ కాంబోపై యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఒకవేళ ఇద్దరు సంగీత దర్శకుల వార్త నిజమైతే మాత్రం, ‘డ్రాగన్’ విజువల్స్‌తో పాటు ఆడియో పరంగా కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం గ్యారెంటీ తారక్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.