NTV Telugu Site icon

Devara: దేవర దిగాడు.. ట్రైలర్ అదిరింది చూశారా?

Devara Trailer

Devara Trailer

Jr NTR Devara Trailaer: దూకే ధైర్యమా జాగ్రత్త.. అంటూ దేవర దిగేందుకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 27వ తేదీన ఆర్ఆర్ఆర్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ వన్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేస్తుంది సినిమా యూనిట్. ఇక అందులో భాగంగానే ముంబై బేస్ గా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ఒకటి నిర్వహించి ట్రైలర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.

Lavanya – Raj Tarun: రాజ్ తరుణ్-లావణ్య.. మాకేంట్రా ఇదీ?

సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే రిలీజ్ అవుతున్న ప్రమోషనల్ కంటెంట్ హైప్ మరింత ఎక్కించేలానే ఉంది. ఈ సినిమాని యువసుధా ఆర్ట్స్ బ్యానర్ మీద సుధాకర్ మిక్కిలినేనితో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ ను చాలా ఆసక్తికరంగా కట్ చేశాడు డైరెక్టర్. సినిమాలో ఉన్న ఇంటెన్స్ మొత్తాన్ని ట్రైలర్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రెండు భిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారానే క్లారిటీ ఇచ్చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.