Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?

Jr Ntr

Jr Ntr

Lenin: అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌కు తగ్గట్టుగా ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చిత్తూరు యాసలో మాట్లాడనుండటంతో, తిరుపతిలో ఈవెంట్ చేయడం ద్వారా లోకల్ ఆడియన్స్‌కు మరింత కనెక్ట్ అవ్వచ్చని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ ఈవెంట్‌కు సంబంధించి ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక క్రేజీ వార్త హల్‌చల్ చేస్తోంది. ‘లెనిన్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీతో ఎన్టీఆర్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం, అఖిల్ – ఎన్టీఆర్ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని లెనిన్ సినిమా కోసం ఆయన తిరుపతి ఈవెంట్‌కు వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఒకవేళ తారక్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తే తిరుపతిలో అక్కినేని – నందమూరి అభిమానుల సందడి మామూలుగా ఉండదు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

×
×
Ad