Krishna Burugula: రెమ్యునరేషన్ కంటే కంటెంట్ ఉన్న కథలకే నా మొదటి ప్రాధాన్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna Burugula: ‘జిగ్రీస్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కృష్ణ బూరుగుల.. డబ్బు, సినిమాల సంఖ్య కంటే మంచి కంటెంట్ ఉన్న కథలకే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్న తీరు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ‘జిగ్రీస్’ కంటే ముందు రెండు మూడు సినిమాల్లో కనిపించినా, ఈ సినిమా రిలీజ్ తర్వాతే కృష్ణకు అసలైన గుర్తింపు వచ్చింది. పక్కింటి కుర్రాడిలా న్యాచురల్ యాక్టింగ్, మంచి కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా అవార్డులు కూడా గెలుచుకున్నాడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు చాలామంది నిర్మాతలు అతనితో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు.
అయితే, ఆఫర్లు వస్తున్నాయి కదా అని తొందరపడి ఏ సినిమా పడితే ఆ సినిమాకు సైన్ చేయడం లేదు కృష్ణ. “ఆకలిగా ఉన్నా సరే.. తొందరపడకూడదు” అనే మాటను బలంగా నమ్ముతున్నాడు. కేవలం రెమ్యునరేషన్ కోసం పరిగెత్తి పది రొటీన్ సినిమాలు చేసే బదులు, నిలబడి నాలుగు సినిమాలు చేసినా కాలర్ ఎగరేసి చెప్పుకునేలా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. నాని, నవీన్ పోలిశెట్టి లాంటి హీరోల బాటలో కేవలం కథకు, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. తెరపై నటించడం కంటే ఆ పాత్రలో ఒదిగిపోవడానికి ఇష్టపడే కృష్ణ, త్వరలోనే ఒక కొత్త పాయింట్‌తో, కడుపుబ్బా నవ్వించే ఎంటర్టైనర్ సినిమాను అనౌన్స్ చేయబోతున్నాడట. దీంతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన కథలు కూడా చర్చల దశలో ఉన్నాయని చెబుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Visakhapatnam: కైలాసగిరి వద్ద స్కూల్ బస్సు ప్రమాదం.. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ఆరా!
-
Monkey Riding Dog : కుక్క వీపుపై కోతి స్వారీ.. కురవిలో ఆసక్తి రేపిన వింత దృశ్యం
-
AP Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా..
-
Kadapa: ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థి తండ్రి గన్ తో హల్చల్
-
Kaaka Movie: ‘కాకా’ నైజాం రైట్స్ ఆ సంస్థకే.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!