JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
JD Chakravarthy: టాలీవుడ్ సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి ఎప్పుడూ తనదైన శైలిలో మాట్లాడుతూ.. వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన ఎన్టీవీ నిర్వహించిన పాడ్‌కాస్ట్ షోలో పాల్గొని పలు ఆసక్తికర అంశాలపై నోరు విప్పారు. చాలా కాలంగా జేడీ చక్రవర్తి పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయనను ఈ విషయంపై ప్రశ్నించగా, “నేను పెళ్లి చేసుకున్నట్లు కనీసం నాకైనా చెప్పండి” అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మహేశ్వరితో ఉన్న అనుబంధం, గతంలో వచ్చిన రూమర్ల గురించి కూడా ఆయన సరదాగా ఈ పాడ్‌కాస్ట్‌లో స్పందించారు.
సినిమా ఇండస్ట్రీలో ఉండే ‘కాస్టింగ్ కౌచ్’ గురించి మాట్లాడుతూ.. ఇది కేవలం అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా ఉంటుందని జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. “అబ్బాయిలకు కూడా కాస్టింగ్ కౌచ్ ఉంటుందా?” అని అడగ్గా అవుననే అర్థం వచ్చేలా ఆయన సమాధానమిచ్చారు. తన గురువు రామ్ గోపాల్ వర్మ (RGV) గురించి మాట్లాడుతూ.. ఆయన గురించి తనకు తెలిసినన్ని విషయాలు మరెవరికీ తెలియవని చెప్పారు. వర్మతో ఉన్న సాన్నిహిత్యం, ‘సత్య’ సినిమా విజయం వెనుక ఉన్న రహస్యాలను ఈ షోలో పంచుకోనున్నట్లు ప్రోమో ద్వారా అర్థమవుతోంది. తన సినిమాల్లో ఉండే ముద్దు సీన్ల గురించి మాట్లాడుతూ.. “నేను గ్లాస్ పెట్టుకుని ముద్దు పెట్టుకోవడం నేర్చుకున్నాను” అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. ఈ పాడ్‌కాస్ట్‌లో జేడీ చక్రవర్తి తన కెరీర్లో ఎదుర్కొన్న సవాళ్లు, వివాదాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పంచుకుటున్నట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. ఈ ఫుల్ పాడ్‌కాస్ట్ త్వరలోనే ఎన్టీవీ యూట్యూబ్‌లో ప్రసారం కానుంది.
Also Read
- Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్‌తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
- Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
- Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
- The Paradise: 'ఆయా షేర్' తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. 'ది ప్యారడైజ్' సెకండ్ సింగిల్‌కి డేట్ ఫిక్స్!
తాజావార్తలు
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్‌కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్‌దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్‌కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో