NTV Telugu Site icon

Jayam Ravi : దీపావళి డిజాస్టర్ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?

Brother

Brother

తమిళ స్టార్ హీరోలలో జయం రవి ఒకరు. కానీ ఇటీవలి కాలంలో జయం రవి టైమ్ అంత కలిసి రాలేదనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ సతీమణి ఆర్తిరవి కి విడాకులు తీసుకున్నాడు ఈ హీరో. ఈ విడాకుల వ్యవహారం ఒకవైపు కోర్ట్ లోనడుస్తుండగానే మరోవైపు తాను నటించిన లేటెస్ట్ సినిమా బ్రదర్ ను రిలీజ్ చేసాడు రవి. ప్రియాంక మోహన్, జయం రవి కలయికలో వచ్చిన ఈ సినిమా దీపావళి కానుకగా తమిళ్ లో రిలీజ్ అయింది. సీనియ‌ర్ క‌థానాయిక భూమిక ఓ కీల‌క పాత్ర పోషించింది. హ‌రీస్ జ‌య‌రాజ్ మ్యూజిక్ అందించిన బ్రదర్ జయం ర‌వి 30వ సినిమా.

Also Read : Mahavatar : మరో భారీ ప్రాజెక్ట్‌ కు శ్రీకారం చుట్టిన హోంబలే ఫిల్మ్స్‌

ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన బ్రదర్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. బ్ర‌ద‌ర్ మూవీలో ప్రియాంక‌ అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. . అమ‌ర‌న్‌, లక్కీ భాస్కర్, బ్లడీ బెగ్గర్ తో పోటీగా వచ్చిన ఈ సినిమాకు ఎమ్ రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రొటీన్ కథతో వచ్చిన  బ్రదర్ సూపర్ ప్లాప్ గా నిలిచింది. కాగా బ్ర‌ద‌ర్ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను జీ5 ఓటీటీ కొనుగోలు చేసింది. ఈ సినిమాను ఈనెల 29న ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానుంది zee 5. థియేట‌ర్ల‌లో కేవ‌లం త‌మిళంలోనే రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం ఐదు భాష‌ల్లో త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్  చేస్తోంది జీ.  థియేటర్స్ లో ప్లాప్ అయిన బ్రదర్ ఓటీటీలో ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.

Show comments