తమిళ స్టార్ హీరో జయం రవి వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన భార్య ఆర్తితో విడాకులు ఇస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. తర్వాత నుంచి ఆమెతో కలిసి ఉండడం లేదు. సింగర్ కెనిషాతో ఆయనకు రిలేషన్ ఉందనే ప్రచారం నేపథ్యంలో, ఈ మధ్య వీరిద్దరూ కలిసి ఒక పెళ్లిలో కనిపించారు. వెంటనే ఆయన భార్య ఆర్తి ఒక సుదీర్ఘమైన లేఖ విడుదల చేశారు. తాజాగా ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలను ఖండిస్తూ జయం రవి కూడా ఒక లేఖ విడుదల చేశారు.
Also Read:Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సినిమాలో విలన్ గా సీనియర్ హీరో..?
నిజానికి వీరి విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. అయితే, వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఎమోషనల్, ఫిజికల్ అబ్యూజ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. గత వారం విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో ఆర్తి, జయం రవి పిల్లలను పట్టించుకోవడం లేదని ఆరోపించగా, తాజాగా జయం రవి, ఆమె తన పిల్లలను ఆయుధాలుగా వాడుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు.
Also Read:Balakrishna : జైలర్-2లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య..?
“నా మీద లేనిపోని అపవాదులు వేస్తే చూస్తూ ఊరుకోను. లీగల్ ప్రాసెస్‌పై నాకు నమ్మకం ఉంది,” అని తాజాగా ఆయన చెప్పుకొచ్చారు. ఆర్తితో వివాహం విషయంలో తాను బంధించినట్లు ఫీల్ అయ్యానని, ఇప్పుడు ఎట్టకేలకు ఫ్రీ అయిన ఫీలింగ్ కలుగుతోందని అన్నారు. “ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా, ఫైనాన్షియల్‌గా కూడా నన్ను ఇబ్బందులకు గురిచేసింది. ఇలా చెప్పడం నాకు బాధగానే ఉంది. కనీసం నా సొంత తల్లిదండ్రులను కూడా కలిసే అవకాశం లేకుండా చేసింది. ఇలాంటి రిలేషన్‌లో ఉండడం కంటే బయటకు వచ్చేయడమే మంచిదని నిర్ణయించాను. ఆర్తి చేస్తున్న అన్ని ఆరోపణలను నేను ఖండిస్తున్నాను. నేను ఇంటిని వదిలి బయటకు వచ్చేటప్పుడే ‘ఎక్స్’ అనే పదం నా మనసులో ముద్రించుకుపోయింది. ఇక జీవితాంతం అది అలాగే ఉండిపోతుంది,” అంటూ ఆయన సుదీర్ఘంగా నాలుగు పేజీల లేఖ రాశారు.
