Site icon NTV Telugu

Jatadhara : ఆయన కేవలం సూపర్ స్టార్ కాదు.. దేవుడు

Jatadhara

Jatadhara

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న కొత్త సినిమా ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మైథాలజీ, సూపర్ నాచురల్ ఎలిమినెట్స్‌తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటిస్తున్న విషయం తెలిసిందే, ఆమె కెరీర్ లో ఎప్పుడూ చేయని ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించనుందట. ఇప్పటికే విడుదలైన సోనాక్షి పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. జీ స్టూడియోస్ బ్యానర్‌లో ఉమేష్ కె.ఆర్ బన్సాల్, ప్రేర్న అరోరా, అరుణ అగర్వాల్, శివిన్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా సూధీర్ బాబు పవర్ ఫుల్ పోస్టర్ తో విష్ చేశారు.

Also Read : Kalpika: ప్రిజం పబ్‌లో హీరోయిన్ పై దాడి..

తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ సీనియర్ హీరోస్‌లో పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. మరి నేడు మే 31న ఆయన జయంతి సందర్భంగా ఘట్టమనేని అభిమానులకి పలు ట్రీట్‌లు కూడా వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ రీ రిలీజ్ థియేటర్స్ లో సందడి చేస్తుండగా.. తాజాగా ‘జటాధర’ పోస్టర్‌తో పాటు హీరో కృష్ణ శివుడి రూపంలో ఉన్న పోస్టర్ పంచుకున్నాడు సూధీర్ బాబు.. ‘ఆయన కేవలం సూపర్ స్టార్ కాదు.. ఒక తుఫాను, తెర దేవుడు, ఒక శక్తి. ఆయన పుట్టినరోజున, ‘జటాధార’ బృందం ఆ దిగ్గజానికి, సూపర్ స్టార్ శివ రామ కృష్ణ మూర్తి గారికి నమస్కరిస్తోంది, ఆయన నిప్పు ఇప్పటికీ మన కథలకు ఇంధనంగా నిలుస్తోంది! అలాంటి తేజస్సు రాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ తెలిపారు.

 

Exit mobile version