JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?

Jasan Sanjay Hero

Jasan Sanjay Hero

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరో దళపతి విజయ్ వారసుడిగా ఆయన తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 2వ తేదీన రిలీజ్ కాగా యావరేజ్ ఫలితం అందుకుంది. కథ, కథనాలలో కొత్తదనం లేదనే రివ్యూస్ వచ్చాయి. అయితే జాసన్ ను హీరోగా చూడాలని విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఆతరుణం రాబోతున్నట్టుగానే ఉంది.

జాసన్ సంజయ్ త్వరలోనే హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నారనే ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తమిళ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ జేసన్ సంజయ్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దళపతి విజయ్‌కి ఉన్న భారీ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, సంజయ్ మొదటి సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ డెబ్యూ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే పలువురు ప్రముఖ దర్శకులు కథలను సిద్ధం చేసి వినిపించినట్లు తెలుస్తోంది. వారిలో మాస్, యాక్షన్ చిత్రాలకు పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు లింగుసామి కూడా ఉన్నారని కథనాలు వెలువడుతున్నాయి. అయితే, తుది నిర్ణయం తీసుకునే ముందు కథ మరియు కథనాలపై గట్టి కసరత్తులు జరుగుతున్నాయి. మరోవైపు ఈ డెబ్యూ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించేందుకు నటుడు విక్రాంత్ సోదరుడైన సంజీవ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన జేసన్ సంజయ్ వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. సిగ్మా చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గాను పనిచేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.