Site icon NTV Telugu

Janu : సూసైడ్ చేసుకుంటానంటూ డాన్సర్ జాను సెల్ఫీ వీడియో.. అసలు విషయం ఇదే..!

Jhanu

Jhanu

ప్రజంట్ సోషల్ మీడియా కారణంగా చాలా దారుణాలు జరుగుతున్నాయి. నటీనటులు సెలబ్రిటీల మీద పుకార్లు పుటిస్తూ అదే పనిగా వారి పై ఇష్టం వచ్చిన వీడియోలు మీమ్స్ ప్రచారం చేస్తున్నారు. ఇక తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి.. రెండో పెళ్లి గురించి మీడియా కథనాలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై విసిగిపోయిన ఢీ డాన్సర్ జాను.. ఇక ఓపిక నశించింది బతకలేనంటూ సూసైడ్ చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది..

Also Read: Sonu Nigam : నోరుజారిన సింగర్ సోను నిగమ్.. మండి పడుతున్న కన్నడ ప్రజలు

‘నమస్తే.. బాగున్నారు కదా అందరూ.. బాగానే ఉంటారు. ఎందుకంటే పక్కోడి జీవితంతో ఆడుకున్నోళ్లంతా బాగానే ఉంటారు. జాను నవ్వితే తప్పు.. జాను ఏడిస్తే తప్పు. జాను ఒకరితో మాట్లాడితే తప్పు. జాను కూర్చుంటే తప్పు.. జాను నిలబడితే తప్పు. జాను నవ్వితే చాలు ఓవరాక్షన్ అంటున్నారు. జాను పద్ధతిగా ఉండదు. పద్ధతి నేర్చుకోవాలి.. ఇలా ఎన్ని మాటలు అంటారు. జాను ఆన్ కెమెరా ఒకలా.. ఆఫ్ కెమెరా మరోలా ఉండదు. నేను అందరితో నవ్వుతూ మంచిగా ఉంటా. వాళ్లు ఎంత పెద్దోళ్లైనా సరే.. చిన్నోళ్లైనా సరే.. వాళ్లతో మంచిగా మాట్లాడతా. అలాంటి నా గురించి తప్ప వేరే మ్యాటర్ ఉండటం లేదు. ఎందుకు నా పర్సనల్ లైఫ్‌ని తీసుకొచ్చి ఇంత హైలైట్ చేస్తున్నారు? దేని కోసం నన్ను టార్గెట్ చేస్తున్నారు?. ఎక్కడ చూసినా జానుకి రెండో పెళ్లి అంటూ నా ఫోటో పెట్టడం.. నా రెండో పెళ్లి గురించి రాసేయడం. అసలు నా పర్సనల్ లైఫ్‌ని ఎందుకు తీస్తున్నారు.

Also Read : Vijaya Devarakonda: ట్రైబల్స్ వ్యాఖ్యల వివాదంపై స్పందించిన విజయ్ దేవరకొండ

ఎవరో గుడికి పోతే రేప్ చేసి చంపేశారట. ఆ అమ్మాయి గురించి మాట్లాడొచ్చు కదా. ఆ ఎదవల గురించి మాట్లాడొచ్చు కదా.. చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు వాళ్ల గురించి మాట్లాడొచ్చు కదా. సరే నా గురించి మాట్లాడుకున్నారే అనుకో .. 8 ఏళ్లుగా ఒక కొడుకుని పెంచుకుంటుంది. చాలా పద్ధతిగా ఉంటుంది. ఢీ షో లో మన తెలంగాణ అమ్మాయి విన్నర్ అయ్యిందని చెప్పుకోవచ్చు కదా. నా గురించి నా పర్సనల్ లైఫ్ గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు? ఇన్‌స్టాగ్రామ్‌లో నా వీడియోలకి గలీజ్ గలీజ్ వాయిస్‌లు పెడుతున్నారు. వాటిని నా కొడుకు చూడడా? ఫస్ట్ టైమ్ అనిపిస్తుంది నాకు వీటన్నింటికీ దూరంగా ఎక్కడికన్నా వెళ్లి చచ్చిపోవాలనిపిస్తుంది. నిజంగా నా లైఫ్‌లో ఏమీ లేకుండా ఉండి ఉంటే.. ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేదాన్ని. నేను చచ్చిపోతే కారణం మీరే అవుతారు. ఇది బాగా గుర్తు పెట్టుకోండి’ అంటూ భోరుమంది. ప్రజంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version