Sumalatha : బాలయ్యపై వ్యాఖ్యలకు జానీ మాస్టర్ భార్య క్షమాపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో గత కొద్ది రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదానికి ఎట్టకేలకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్, అలాగే నందమూరి బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యల విషయంలో జానీ మాస్టర్ భార్య సుమలత వెనక్కి తగ్గారు. తాజాగా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లోని నిర్మాతల మండలి హాల్లో తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్, వైవిఎస్ చౌదరి తదితరులతో కలిసి ఆమె ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ వేదికపై సుమలత బహిరంగంగా క్షమాపణలు కోరగా, మరోసారి ఇలాంటి దాడులు జరిగితే ఐదేళ్ల పాటు సహాయనిరాకరణ (బ్యాన్) తప్పదని ప్రసన్న కుమార్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ప్రెస్మీట్లో మాట్లాడిన సుమలత, గతంలో జరిగిన పరిణామాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “మా యూనియన్‌లో జరిగిన అవకతవకలపై మొదలైన వివాదం, ఫెడరేషన్తో గొడవలకు దారితీసింది. నాన్-కోఆపరేషన్ అడగటం కోసం ఛాంబర్ మీటింగ్‌కు వచ్చాము. ఆ సమయంలో పల్లి కేశవరావుపై దాడి జరగడం పట్ల మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గారికి సారీ చెబుతున్నాను. మాకు వ్యక్తిగతంగా ఎవరితోనూ గొడవలు లేవు” అని ఆమె స్పష్టం చేశారు. ఇక నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. “బాలకృష్ణ గారి లాంటి పెద్దల వల్లే ఇండస్ట్రీ ఇవాళ బాగుంది. వారి గురించి తప్పుగా మాట్లాడే అర్హత గానీ, ధైర్యం గానీ మాకు లేదు. నేను ఆ మాట అన్నందుకు ఎంతో బాధపడుతున్నాను. ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలన్నది ఇప్పుడు తెలుసుకున్నాను. మా వివాదాన్ని పరిష్కరించమని చెప్పిన బాలయ్య బాబుకు కృతజ్ఞతలు” అంటూ సుమలత చేతులెత్తి నమస్కరించారు. ఇకపై ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఫెడరేషన్తో కలిసి పనిచేస్తామని ఆమె హామీ ఇచ్చారు.
Also Read
- January 12 Vidudala: సినిమా అంతా బ్లాక్‌బస్టర్ కళ ఉట్టిపడుతోంది.. ఆ సినిమాపై జీవీ ప్రకాశ్ సెన్సేషనల్ రివ్యూ!
- Mythri Movie Makers: సౌత్ హిట్ డైరెక్టర్లందరూ మైత్రి చేతిలోనే.. ఏ ఒక్కరినీ వదలట్లేదుగా!
- Alias Rukmini : ‘అలియాస్ రుక్మిణి’లో శృంగార సన్నివేశాలున్నాయా?.. నిర్మాత దీప్తి షాకింగ్ క్లారిటీ!
- Indian 3 : 'ఇండియన్ 3'పై క్రేజీ అప్డేట్.. అప్పుడే మొదలెట్టేశారుగా..!
తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ఈ వివాదంలో తెరవెనుక జరిగిన రాజకీయాలను బయటపెట్టారు. “కొందరు తమ వ్యక్తిగత లబ్ధి కోసం సుమలతను రాంగ్ రూట్లో ముందుకు తోశారు. దొమ్మి వాతావరణంలో ఛాంబర్ ఈసీ మీటింగ్‌లోకి వచ్చి అనిల్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ఛాంబర్ సభ్యులు సీరియస్ కావడంతో సమస్య జటిలమైంది. చివరికి తన తప్పు తెలుసుకున్న సుమలత వ్యక్తిగతంగా క్షమాపణ లేఖలు రాసి ముందుకొచ్చారు” అని తెలిపారు. ఈ గొడవకు రాజకీయ రంగు పులమొద్దని ఆయన హితవు పలికారు. “ఇది కేవలం జానీ, సుమలత, డ్యాన్సర్స్ యూనియన్ గొడవ మాత్రమే. దీనికి పవన్ కల్యాణ్, జనసేన, టీడీపీ, వైసీపీలతో ఎలాంటి సంబంధం లేదు. ఇదొక టీ కప్పులో తుఫాన్ లాంటి ఇష్యూ అని, క్లోజ్ చేయమని బాలయ్య బాబు చెప్పడం వల్లే చదలవాడ గారు, నేను ముందుకు వచ్చాము. ఇకముందు ఛాంబర్‌పై గానీ, సభ్యులపై గానీ దాడులు లాంటివి చేస్తే మాత్రం ఐదేళ్ల పాటు సహాయనిరాకరణ చేస్తాము” అంటూ ప్రసన్న కుమార్ కఠిన హెచ్చరిక జారీ చేశారు.
తాజావార్తలు
-
Sumalatha : బాలయ్యపై వ్యాఖ్యలకు జానీ మాస్టర్ భార్య క్షమాపణలు..
-
Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక నిర్ణయం.. PPP విధానంలో అప్పగింత..!
-
Supreme Court: రేపు దీపత్తూన్ వద్ద దీపం వెలిగించాల్సిందే.. ఆలయ ట్రస్టీలపై సుప్రీంకోర్టు వేటు!
-
January 12 Vidudala: సినిమా అంతా బ్లాక్‌బస్టర్ కళ ఉట్టిపడుతోంది.. ఆ సినిమాపై జీవీ ప్రకాశ్ సెన్సేషనల్ రివ్యూ!
-
Deepam Row: దీపం ఎందుకు వెలిగించలేదు? మధురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు ఫైర్!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!