NTV Telugu Site icon

Jani Master Wife: జానీ మాస్టర్ భార్య కూడా.. మరో షాకింగ్ విషయం వెలుగులోకి!

Jani Master Wide

Jani Master Wide

Jani Master Wife Involvement in Rape Case: నార్సింగి పోలీసుల ఎదుట హాజరైన జానీ మాస్టర్ బాధితురాలు జానీ మాస్టర్ పై సంచలన విషయాలను పోలీసులకు తెలిపినట్టు సమాచారం. జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేసి దాడికి దిగాడని సదరు లేడీ కొరియోగ్రాఫర్ వెల్లడించింది. ముంబైతో పాటు హైదరాబాదులో కూడా తనపై లైంగిక దాడి చేశారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. అందుకు తగ్గట్టే పోలీసులకి ఇచ్చిన స్టేట్మెంట్లో సంచలన విషయాలు బయట పెట్టింది లేడీ కొరియోగ్రాఫర్. జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన డ్యాన్సర్‌ నుంచి పోలీసులు స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. 3 గంటల పాటు కొరియోగ్రాఫర్ నుంచి అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తీసుకెళ్లిన పోలీసులు, బాధితురాలికి వైద్య పరీక్షలు కూడా చేయించారు. 

Jani Master: జానీ మాస్టర్ క్యారవాన్ లో బలవంతం చేశాడు.. సంచలన విషయాలు వెలుగులోకి

రోజూ షూటింగ్‌ టైమ్‌లో వ్యాన్‌లోకొచ్చి ప్యాంట్‌ జిప్‌ తీసి బలవంతం చేసేవాడని బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ లో పేర్కొంది. సెక్స్ కోరికలు తీర్చమని నన్ను వేధించాడు అని లేదంటే ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించాడు అని బాధితురాలు వెల్లడించింది. ముంబై హోటల్ లో మాత్రమే కాకుండా హైదరాబాదులో కూడా పలుమార్లు నాపై అత్యాచారం చేశాడు అని ఆమె వెల్లడించింది.  అతని కోరికను తీర్చకపోతే నాపై బలవంతంగా దాడికి తెగబడ్డాడని పేర్కొంది. వారి బాధలు భరించ లేక బయటకు వెళ్లి పని చేసుకుంటుంటే జానీ మాస్టర్, భార్య ఇద్దరూ ఇంటికి వచ్చి నాపై దాడికి దిగారని ఆమె వెల్లడించింది. అంతేకాదు తనను మతం మార్చుకుని వివాహం చేసుకోవాలని జానీ మాస్టర్ నాపై ఒత్తిడి తెచ్చాడని ఆమె పేర్కొంది.

Show comments