Jani Master Wife Ayesha Face To Face On Jani Case: నేటితో జానీ మాస్టర్ నాలుగో రోజు కస్టడీ విచారణ ముగియనున్న క్రమంలో మరికొద్ది సేపట్లో జానీ మాస్టర్ జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించనున్నారు. జానీ మాస్టర్ ను ఉప్పర్ పల్లి కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. పోలీసుల కస్టడీ జానీ మాస్టర్ విచారణకు సహకరించినట్టు తెలుస్తోంది. కస్టడీ విచారణలో బాధితురాలే తనను జానీ మాస్టర్ వేధించిందని స్టేట్ మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నిన్న జానీ మాస్టర్ ను కలిసి వస్తున్న ఆయన భార్యను ఎన్టీవీ పలకరించింది. ఈ క్రమంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. జానీ మాస్టర్ భార్య మాట్లాడుతూ ఇది అనుకోకుండానే జరిగింది, ఆ అమ్మాయి కావాలనే కేసు పెట్టింది. ఏమీ ఆశిస్తుందో ఏమో తెలియడం లేదు అన్ని దేవుడికి తెలియాలి. ఇది చిన్న విషయం ఏదో కాదు చాలా పెద్ద ఎలిగేషన్ చేశారు. దాన్ని కోర్టులోనే డిసైడ్ చేసుకుని బయటికి వస్తారు.
ఇంకొకటి ఏదో నిజం ఒప్పుకున్నారు అంగీకరించారు అని రాస్తున్నారు అది నిజం కాదు. మీరందరూ థంబ్నెయిల్ కోసం అలా పెడుతున్నారు అది నిజం అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు. ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్న జానీ మాస్టర్ కి ఇలాంటి పరిస్థితి రావడం ఎలా ఫీలవుతున్నారు అంటే చాలా బాధాకరమే కదా. ఆయన అభిమానులు కూడా ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్నారు. దీని వెనక ఏదో జరిగి ఉంటుందని జానీ మాస్టర్ అలాంటి వారు కాదని వారు అభిప్రాయపడుతున్నారు అని జానీ మాస్టర్ భార్య చెప్పుకొచ్చారు. వ్యవహారం వెనుక ఒక పెద్ద హీరో ఉండి నడిపిస్తున్నాడు అనే ప్రచారం జరుగుతోంది దానిమీద మీరు ఎలా స్పందిస్తారు అంటే నేను అసలు ఈ విషయం మీద స్పందించాలి అనుకోవడం లేదని ఆమె అన్నారు. నేను ఒకటి అంటే మీరు ఒకటి అన్నట్టుగా జనాల్లోకి తీసుకువెళుతున్నారు. వేరే వేరే థంబ్నెయిల్స్ వేస్తున్నారు కాబట్టి నో కామెంట్స్ అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయారు.