Jani Master planned to do a Movie with Alleged Lady Choreographer as Heroine: తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా తమిళ, బాలీవుడ్ సినీ పరిశ్రమలో కూడా కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ ఇప్పుడు పరారీలో ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన తనను రేప్ చేశాడని పలుసార్లు బలవంతంగా వేధించాడని ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఒక యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు జానీ మాస్టర్ మీద కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన లడాక్ లో ఉన్నారని తెలిసి అక్కడికి ఎస్ఓటీ పోలీసులు బృందం వెళితే అక్కడ నుంచి కూడా ఆయన మిస్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో అనేక షాకింగ్ విషయాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి.
Jani Master: జానీ మాస్టర్ ఇష్యూ..ఇక నోరు విప్పకండి.. డ్యాన్సర్లకు వార్నింగ్
అందులో ఒక విషయం ఏమిటంటే జానీ మాస్టర్ హీరోగా సినిమా బండి హీరో వికాస్ మరో హీరోగా యధా రాజా తథా ప్రజా అనే సినిమా 2022 ఆగస్టులో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో ఇప్పుడు ఎవరైతే ఒక లేడీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద కేసు పెట్టిందో ఆమె హీరోయిన్గా నటిస్తున్నట్టు అప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది. ఆ అధికారిక ప్రకటన రావడమే కాదు పూజా కార్యక్రమానికి కూడా ఆమె హాజరైంది. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో శర్వానంద్ తో పాటు సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ కూడా హాజరయ్యారు. ఈ సినిమాకి శర్వానంద్ క్లాప్ కొట్టగా ఆయుష్ శర్మ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సినిమా ఓపెనింగ్ అనంతరం సదరు యువతి జానీ మాస్టర్ వల్లే ఈ స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చింది. అలాంటిది ఆమె ఇప్పుడు ఇలా కేసు పెట్టడం కలకలం రేపుతోంది.