NTV Telugu Site icon

Jani Master : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్..

Untitled Design (18)

Untitled Design (18)

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోణలు నేపథ్యంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినసంగతి తెలిసిన విషయమే. ఓ షో కోసం జానీ మాస్టర్ తో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు హోటల్లో తనపై అత్యాచారం చేసాడని, ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దు అంటూ బెదిరించడని, అలాగే షూటింగ్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించేవాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చెసాడని నార్సింగి పోలీసులకు జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసే యువతి కేసు పెట్టింది. ఈ ఆరోపణలు నేపథ్యంలో జానీ మాస్టర్ ను  కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి జానీని తొలగించారు.

Also Read : NaniOdela2 : కేవలం ‘యాక్షన్’ కోసం 4 కోట్ల 84 లక్షల 400 సెకండ్లు..

యువతి తనపై కేసు పెట్టిన విషయం తెలుసుకున్న జానీ మాస్టర్  ఎవరికీ అందుబాటులో లేకుండా, పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి కనిపించకుండా తప్పించుకు తిగుతున్నాడు. వీలైనంత త్వరగా తమ ముందు హాజారుకావాలని, విచారణకు సహకరించాలని నోటిసులు ఇచ్చిన కూడా జానీ స్పందించలేదు.దాంతో పోలీసులు ఈ కేసులో దూకుడు పెంచారు. జానీ ఎక్కడున్నాడోనని వెతుకులాట ప్రారంభించి పక్క సమాచారంతో నేడు అరెస్ట్ చేసారు. ప్రస్తుతం జానీ మాస్టర్ సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసుల అదుపులో ఉన్నాడు. బెంగళూరులో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, గత ఐదు రోజులుగా పోలీసులకు దొరక్కుండా దాక్కున్న జానీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. లద్దాక్‌, నెల్లూరులో గాలించిన పోలీసులు చివరకు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Show comments