NTV Telugu Site icon

Jani Mastar : త్వరలో నేనేంటో నిరూపించుకుంటా..

Jani

Jani

 

ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై లైంగిక వేధింపుల కారణంగా ఓ మహిళా కొరియోగ్రాఫర్ కేసుపెట్టడంతో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం తో చంచల్ గూడ జైలు నుండి జానీ మాస్టర్ బెయిల్ పై విడుదల అయ్యాడు. విడుదల అయి చాలా రోజలు అవుతున్న మీడియాకు అలాగే సినిమాలకు కాస్త దూరంగా ఉన్న జానీ మాస్టర్ తాజగా జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా వస్తున్న KCR అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు.

కాగా ఈ వేదిక పై జానీ మాస్టర్  మాట్లాడుతూ ” ప్రతి భర్త వెనకాల భర్య ఉంటుంది. వాళ్ళ వల్లే భర్తలు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఈ మధ్య నా జీవితంలో నాకు కొన్ని కొన్ని జరిగాయి. ఆ క్లిష్ట సమయంలో నా భార్య నాకు వెన్నుముకలగా, గజస్తంభంగ నిలబడింది. అలాగే నన్ను నమ్మిన నా ప్రజలకు, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చాక ఎవరు కనిపించరు. అలాంటింది నన్ను మీ ఇంటి కుర్రాడి లాగ, మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించినందుకు చాలా చాలా థాంక్స్. నా మీద నమ్మకం ఉంచినందుకు. ఆ నమ్మకం అలాగే ఉంటది, అది ఎక్కడికి పోదు. త్వరలొనే నేనేంటో చూపిస్తా. ఇప్పుడు సందర్భం కాదు ఆ విషయం గురించి మల్లి మాట్లాడతాను ” అని అన్నారు. బెయిల్ పై బటయ ఉన్న జానీ మాస్టర్ సినిమాలు ఏవి చెయ్యట్లేదు.

Also Read : Hot Star : ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఓనమ్ బ్లాక్ బస్టర్

Show comments