Site icon NTV Telugu

Janhvi Kapoor: అచ్చియమ్మ లచ్చనంగా ఉందే!

Janhvi Kapoor

Janhvi Kapoor

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా జాన్వీ కపూర్ నటిస్తోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లు, గ్లింప్స్, వర్కింగ్ స్టిల్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ రోజు, మేకర్స్ జాన్వీ కపూర్ ‘అచ్చియమ్మ’ ఫస్ట్ లుక్‌ను రెండు విభిన్న పోస్టర్‌ల ద్వారా ఆవిష్కరించారు.

Also Read :DVV Entertainments : ప్రశాంత్ వర్మ అడ్వాన్స్’ల పంచాయితీ.. మాకేం సంబంధం లేదన్న డీవీవీ

మొదటి పోస్టర్‌లో, జాన్వీ కపూర్ ఒక మైక్రోఫోన్ స్టాండ్‌ వద్ద నిలబడి, రుస్టిక్ ప్రింటెడ్ చీర, సంప్రదాయ ఆభరణాలు, సన్ గ్లాసెస్‌తో ఆత్మవిశ్వాసంతో పోజు ఇస్తూ కనిపించింది. ఈ స్టైలింగ్ మొత్తం పల్లెటూరి పండుగ వాతావరణాన్ని, మట్టి వాసనతో కూడిన జానపద కళాత్మకతను గుర్తుచేస్తోంది. రెండవ పోస్టర్‌లో, జాన్వీ నీలిరంగు చీర ధరించి ఒక జీపుపై నిలబడి, పెద్ద జన సమూహానికి ఆత్మవిశ్వాసంతో అభివాదం చేస్తూ కనిపిస్తుంది. ఇది ఆమె పాత్ర ప్రాముఖ్యతను, చూపిస్తోంది. ఆమె పాత్రను “తీవ్రమైన, నిర్భయమైన” (fierce and fearless) గా అభివర్ణించారు, ఇది సినిమాలో జాన్వీ పాత్ర ప్రాముఖ్యాన్ని చెబుతోంది. ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు కెమెరా బాధ్యతలు, మరియు నేషనల్ అవార్డు గ్రహీత ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారు. ‘పెద్ది’ చిత్రం 2026 మార్చి 27 న పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Exit mobile version