NTV Telugu Site icon

Janhvi Kapoor: శ్రీదేవి పుట్టినరోజు.. తిరుమలలో ప్రియుడితో కలిసి మోకాళ్లపై జాన్వీ సాష్టాంగ నమస్కారం

Janhvi Kapoor

Janhvi Kapoor

Janhvi Kapoor Visits Tirumala With Boyfriend Shikhar Pahariya: ఆగస్ట్ 13, మంగళవారం అతిలోక సుందరి, నటి శ్రీదేవి పుట్టిన రోజు. దివంగత నటికి అభిమానులు నివాళులు అర్పిస్తూ ఉండగా, ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా జాన్వీ కపూర్ తిరుమల తిరుపతి ఆలయానికి చేరుకున్నారు. ఆమె ప్రతి సంవత్సరం తన తల్లి పుట్టినరోజున తిరుమలకి వస్తుంటుంది. ఈరోజు కూడా పసుపు రంగు చీర మరియు ఆకుపచ్చ సాంప్రదాయ బ్లౌజ్ ధరించిన జాన్వీ ఇక్కడి ఆలయంలో ప్రార్థనలు చేసింది. ఈ సమయంలో, జాన్వీ రూమర్ద్ లవర్ శిఖర్ పహాడియా కూడా ఆమెతో ఉన్నాడు. జాన్వీ తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెమరబుల్ పోస్ట్ చేసింది. ఇక ఆమె ఆలయ సందర్శన క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పసుపు పట్టు చీరలో దక్షిణ భారత సంప్రదాయ ఆభరణాలతో అలంకరించబడింది.

“తంగలాన్” కోసం 50 రోజులు రీ రికార్డింగ్..ట్రైబ్స్ మ్యూజిక్ అబ్సర్వ్ చేశా- జీవీ ప్రకాష్ కుమార్ ఇంటర్వ్యూ

శిఖర్ పహాడియా కూడా ఆమె వెంటే కనిపించాడు. శిఖర్ కూడా దక్షిణ భారత సంప్రదాయ దుస్తులైన పంచెకట్టుతో కనిపించాడు. ఇద్దరూ కూడా ఆలయంలో మోకరిల్లి, వెంకన్న ఆశీస్సులు తీసుకుంటూ కనిపించారు. ఇక జాన్వీ తన తిరుపతి పర్యటన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో ఒకదానిలో గుడి మెట్లు కనిపిస్తూ ఉండడంతో ఆమె కాలినడకన వెళ్లినట్టు తెలుస్తోంది. జాన్వీ కపూర్ గత కొన్నేళ్లుగా తాను తిరుపతి ఆలయాన్ని ఎందుకు ఎక్కువగా సందర్శిస్తున్నానో అనేక సంధర్భాల్లో చెప్పింది. ‘గత 5-6 ఏళ్లలో ఆధ్యాత్మికత పట్ల నాకు శ్రద్ధ పెరిగింది. నేను నా మతం, నా ఆధ్యాత్మికత ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఆశ్రయం పొందుతున్నాను. ఎప్పుడు ఆయన పిలిచినా తిరుపతి చేరుకుంటా, గుడి మెట్లు ఎక్కి ఆయన్ని దర్శనం చేసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది అని ఆమె పేర్కొంది.

Show comments