Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Film Celebrity Interviews Music Director Gv Prakash Kumar Interview For Thangalaan

“తంగలాన్” కోసం 50 రోజులు రీ రికార్డింగ్..ట్రైబ్స్ మ్యూజిక్ అబ్సర్వ్ చేశా- జీవీ ప్రకాష్ కుమార్ ఇంటర్వ్యూ

Published Date :August 13, 2024 , 5:45 pm
By Bhargav Chaganti
“తంగలాన్” కోసం 50 రోజులు రీ రికార్డింగ్..ట్రైబ్స్ మ్యూజిక్ అబ్సర్వ్ చేశా- జీవీ ప్రకాష్ కుమార్ ఇంటర్వ్యూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Music Director GV Prakash Kumar Interview for “Thangalaan”: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతి తిరువొతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న నేపథ్యంలో సినిమాకు మ్యూజిక్ చేసిన ఎక్స్పీరియన్స్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో షేర్ చేశారు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్.

– “తంగలాన్” సినిమా ఆఫర్ నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. “తంగలాన్” ఇండియానా జోన్స్ వంటి భారీ మూవీ. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు ఈ కథకు ఎలాంటి మ్యూజిక్ చేయాలి అనేది అర్థమైంది. ట్రైబల్ నేపథ్యంగా ప్రీ ఇండిపెండెన్స్ టైమ్ లో జరిగిన స్టోరీ ఇది. ట్రైబల్స్ ఎలాంటి మ్యూజిక్ క్రియేట్ చేస్తారు అనేది ఆలోచించా. ఆస్ట్రేలియా, ఆఫ్రికన్ ట్రైబ్స్ క్రియేట్ చేసే కొన్ని మ్యూజిక్ అబ్సర్వ్ చేశా. ఇలాంటి సినిమాకు మోడరన్ మ్యూజిక్ సెట్ కాదు. ఒరిజినల్ గా, ఆ కథా నేపథ్యానికి తగినట్లు మ్యూజిక్ క్రియేట్ చేశా. “తంగలాన్”కు మ్యూజిక్ ఇవ్వడంలో నా టీమ్ ఎంతో సపోర్ట్ చేశారు.

Also Read

  • Tollywood : బీస్ట్ మోడ్‌లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్
  • OTT Movies : థియేటర్స్‌లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
  • Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
  • Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ - కావ్య వివాహం

– “తంగలాన్” ఒక భారీ సినిమా. ఈ సినిమా కోసం 50 రోజులు రీ రికార్డింగ్ చేశా. కొన్నిసార్లు రెండు మూడు రోజుల ముందు ట్యూన్ చేయాల్సి వచ్చేది. టైమ్ తక్కువగా ఉండటం ఒక్కటే ఈ సినిమాకు మ్యూజిక్ చేయడంలో నేను ఎదుర్కొన్న సవాలు. అయినా పర్ఫెక్ట్ ఔట్ పుట్ తీసుకురాగలిగాం. దర్శకుడు పా రంజిత్ తన విజన్ ను నాకు చెప్పాడు, ఆ విజన్ ను అర్థం చేసుకుని అందుకు తగినట్లు మ్యూజిక్ చేశా. సంగీత దర్శకుడిగా “తంగలాన్”కు వర్క్ చేయడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది.

– “తంగలాన్” టైటిల్ సాంగ్, మనకి మనకి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో చాలా వ్యూస్ వస్తున్నాయి. పాటలే కాదు బీజీఎం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ కథలో ప్రేమ, కుట్ర, పోరాటం, కోపం వంటి ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని ఎలివేట్ చేసేలా, మరింత ప్రేక్షకులకు ఎఫెక్టివ్ గా రీచ్ చేసేలా బీజీఎం చేశాను.

– దర్శకుడు పా.రంజిత్ గారు ఒక గొప్ప మూవీని మీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఆయన మ్యాజికల్ రియలిజం స్క్రీన్ ప్లేతో సినిమాను రూపొందించారు. మ్యాజికల్ రియలిజంతో గతంలోనూ కొన్ని పీరియాడిక్ మూవీస్ వచ్చినా..ఇందులో మరిన్ని అదనపు లేయర్స్ ఉంటాయి. పా రంజిత్ గారితో వర్క్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది.

– విక్రమ్ ఈ సినిమా కోసం మారిపోయిన తీరు ఆశ్చర్యపరిచింది. ఇది నటీనటులకు ఫిజికల్ గా స్ట్రెయిన్ చేసే సినిమా. విక్రమ్ గారు తన గత చిత్రాల్లాగే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. “తంగలాన్”లో ఫిమేల్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. పార్వతి తిరువొతు, మాళవిక ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.

– “తంగలాన్” సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. నేను మీతో పాటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తున్నాను. మీరంతా “తంగలాన్” చూసి థ్రిల్ ఫీలవుతారని మాత్రం చెప్పగలను.

– ఏఐ సహా ఎన్నో కొత్త టెక్నాలజీలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే టెక్నాలజీపై ఆధారపడటం సరికాదు. ఎంతవరకు మనం టెక్నాలజీ ఉపయోగించుకోవాలి అనే ఐడియా ఉండాలి.

– తెలుగులో దుల్కర్ హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్, నితిన్ హీరోగా చేస్తున్న రాబిన్ హుడ్ తో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. దిల్ రాజు గారితో, వైజయంతి బ్యానర్స్ లో మూవీస్ చేయాల్సి ఉంది. తమిళంలో ధనుష్ గారి డైరెక్షన్ లో మూవీ, శివకార్తికేయన్ అమరన్ తో పాటు మరికొన్ని బిగ్, ఎగ్జైటింగ్ సినిమాలు చేస్తున్నాను. నటుడుగా, సంగీత దర్శకుడిగా నా ప్రయారిటీస్ క్లియర్ గా పెట్టుకున్నాను. ఏ సినిమాలకు ఎప్పుడు వర్క్ చేయాలనేది ఎవరికీ ఇబ్బంది రాకుండా ప్లాన్ చేసుకుంటున్నా.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • GV Prakash Kumar
  • Music Director GV Prakash Kumar
  • thangalaan

తాజావార్తలు

  • RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు

  • Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions