Janhvi Kapoor : జాన్వీ కపూర్‌పై మలయాళ సింగర్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ & టాలెంటెడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌లలో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతోంది. లీడింగ్ హీరోల సరసన నటిస్తూ, తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటున్న ఈ స్టార్ కిడ్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో ట్రెండింగ్‌లో ఉంటుంది. కానీ తాజాగా ఆమె నటించిన చిత్రం ‘పరమ్ సుందరి’ చుట్టూ ఓ వివాదం చెలరేగింది.
Also Read : Bedroom : మీ బెడ్‌రూంలో దాగి ఉన్న ప్రమాదం.. వెంటనే పారేయాల్సిన 3 ముఖ్యమైన వస్తువులు !
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
సిద్ధార్థ్ మల్హోత్రా – జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ‘పరమ్ సుందరి’. తుషార్ జలోట దర్శకత్వం వహించిన ఈ చిత్రాని ‘ఛావా’ హిట్ అందుకున్న మ్యాడ్‌డాక్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఆగస్టు 29న హిందీ భాషలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ కోసం ఇప్పటికే ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇందులో జాన్వీ కపూర్ మలయాళీ అమ్మాయి పాత్రలో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. ఆమె లుక్, యాక్సెంట్, డ్రెస్ స్టైల్ మీద సోషల్ మీడియాలో మంచి బజ్ వచ్చింది. అయితే ఈ పాత్రపై మలయాళ సింగర్ పవిత్ర మీనన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మలయాళ అమ్మాయి పాత్రకు ఎందుకు మలయాళం నటి కాకుండా బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు..
జాన్వీ మలయాళ యాక్సెంట్‌ను కూడా విమర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాసేపటికే వైరల్ కావడంతో చర్చలు ముదిరాయి. పవిత్ర వీడియోకి రిప్లైగా జాన్వీ అభిమానులు కౌంటర్ ఇచ్చారు. ఆమె చేసిన పోస్ట్‌ను డిలీట్ చేయాలంటూ రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఆ వీడియో తొలగించబడింది. అయితే, దానిపై కూడా పవిత్ర రియాక్ట్ అవుతూ స్క్రీన్‌షాట్లు షేర్ చేయడంతో ఈ వివాదం మరింత హైలైట్ అయ్యింది. ఇక..ఈ ఘటనపై నెటిజన్లలో మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు పవిత్రకు సపోర్ట్ ఇస్తూ, రీజనల్ రోల్స్‌లో ఆ భాషా నటులనే తీసుకోవాలని వాదిస్తే, మరికొందరు మాత్రం జాన్వీని ఇలా విమర్శించడం తప్పని కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!