Janhvi Kapoor: ‘పెద్ది’ అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ నేడు (జూన్ 4, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఈ భారీ చిత్రం విడుదలైన సందర్భంగా.. ఇందులో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన సెంటిమెంట్‌ను మరోసారి చాటుకున్నారు. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు.
తిరుమల కొండపై జాన్వీ కపూర్ చాలా ప్రశాంతంగా గడిపిన ఒక అన్‌సీన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో.. జాన్వీ సాంప్రదాయ దుస్తుల్లో, ఒక అరుగు సాధారణ భక్తురాలిలా కూర్చొని కనిపించారు. తన జీవితంలో ఏ చిన్న ముఖ్యమైన ఘట్టం ఉన్నా, సినిమా రిలీజ్ ఉన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జాన్వీ కపూర్‌కు తల్లి (అతిలోక సుందరి శ్రీదేవి) నుంచి వచ్చిన అలవాటు. ఈ సారి ‘పెద్ది’ సినిమా సాధిస్తున్న భారీ ఓపెనింగ్స్, సక్సెస్ నేపథ్యంలో.. ఆమె కాలినడకన అలిపిరి మార్గంలోని మెట్లు ఎక్కి స్వామి వారిని దర్శించుకున్నారు. పెద్ది విషయానికి వస్తే 1980ల నాటి రూరల్ ఆంధ్రప్రదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రంలో జాన్వీ కపూర్ ‘అచ్చియమ్మ’ అనే పల్లెటూరి యువతి పాత్రలో ఒదిగిపోయారు. థియేటర్లలో ఆమె నటనకు, గ్లామర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం ఈ తిరుమల వీడియోను మెగా ఫ్యాన్స్, జాన్వీ ఫ్యాన్స్ షేర్ చేస్తూ.. సినిమాపై ఆమె చూపిస్తున్న ప్రేమకు, ఆమె నిబద్ధతను, భక్తిభావనను అభినందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read
From seeking Lord Balaji's blessings at Tirumala 🙏✨
To witnessing the love for #Peddi 💜
Forever grateful 🙏🤍#JanhviKapoor #PEDDI pic.twitter.com/j8o7iy5HNQ
— Jahnavi Kapoor (@JanhvikapoorFC_) June 4, 2026
తాజావార్తలు
-
Justin Greaves: టెస్ట్ చరిత్రలో అరుదైన రికార్డు.. ఒక్క పరుగు ఇవ్వకుండా 5 వికెట్లు నేలకూల్చిన వెస్టిండీస్ పేసర్.!
-
Sharmila Dhankhar: పోలియోను జయించి చరిత్ర సృష్టించిన షర్మిలా ధన్ఖర్.. పారా షాట్‌పుట్‌లో స్వర్ణం
-
Pavala Shyamala: టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత..!
-
Abqaiq Refinery Fire: ఇరాక్ డ్రోన్ దాడులు.. సౌదీ అరేబియాలోని అబ్కైక్ ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం
-
Vadhandhi 2: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్‌కు సీక్వెల్.. ‘వధండి 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, ఈసారి హీరో మారిపోయాడు!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!